AP News: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా..!

|

Dec 25, 2023 | 1:04 PM

క్రిస్మస్‌ శుభవేళ మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వల వేస్తే.. వాళ్లు అనుకున్నదాని కంటే.. భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: చేపల కోసం వేసిన వల బరువెక్కింది.. దాన్ని పైకి లాగి చూడగా..!
Fishing Net
Follow us on

క్రిస్మస్‌ శుభవేళ మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వల వేస్తే.. వాళ్లు అనుకున్నదాని కంటే.. భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి. ఒక్కో చేప ఏకంగా 200 నుంచి 400 కిలోల బరువు ఉండడంతో క్రేన్‌ సహాయంతో కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు. ఎప్పటిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది. వలలో భారీ కొమ్ముకోణం చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఒక్క చేప 450 కేజీల బరువు తూగుతోంది. దాంతో ఈ భారీ చేపలను బోట్లలో ఒడ్డుకుతేవడం సాధ్యపడకపోవడంతో వాటిని తీరానికి చేర్చడానికి మత్స్యకారులు క్రేన్‌ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద చేపలు, పెద్దమొత్తంలో పడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా ఈ కొమ్ముకోణం చేపలను కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. కుంభాభిషేకం రేవులో వేలం నిర్వహించగా 430 కేజీల బరువైన చేపను ఆకుల శ్రీనివాస్‌ అనే స్థానిక వ్యాపారి 36 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు.