అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా మృతి చెందిన ముగ్గురు.. అసలేంజరిగిందంటే?

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు- రంగంపేట మధ్య ఘోర ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ టాటాఎస్ వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూళీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారీని హాస్పిటిల్‌కు తరలించారు.

అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా మృతి చెందిన ముగ్గురు.. అసలేంజరిగిందంటే?
East Godavari Road Accident

Edited By:

Updated on: Jun 23, 2026 | 9:21 AM

వారంత దినసరి కూళీలు.. పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకొని సాయంత్రానికి ఇంటికొచ్చేస్తారు. రోజూలాగే సోమవారం ఉదయం కూడా పనికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి బయల్దేరారు. మరో 30 నిమిషాలు అయితే అందరూ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడపాల్సి ఉంది. కానీ అంతలోనే వారితో విధి వింతనాటకం ఆడింది. మొత్తం 11 మంది కూళీలతో ప్రయాణిస్తున్న టాటాఎస్ వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే మరణించగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం, పిఠాపురం మండలం మల్లాం, జల్లూరు గ్రామాలకు చెంది11 మంది కూళీలు బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి ఓ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. సాయంత్రం రెడీమిక్స్ వాల్స్ పనులు పూర్తి చేసుకుని మిగిలిన సామగ్రితో టాటాఎస్ వాహనంలో ఇంటికి బయల్దేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం వడిశలేరు- రంగంపేట సమీపంలోకి రాగానే టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు అనే ముగ్గురు కూళీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గాయాలతో బయటపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీని అక్కడికి చేరుకున్న పోలీసులు తొలత గాయపడిన వారిని అంబులెన్స్ సహాయంతో పెద్దాపురం ప్రభుత్వం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us