మదనపల్లిలో నివ్వేర పరుస్తున్న పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!

అన్నమయ్య జిల్లాలో మాయల మరాఠి బండారం బయటపడింది. మహిళ వేషం లో పలువురికి వలపు గాలం వేసిన పురుష పుంగవుడు యవ్వారం నివ్వెర పరుస్తోంది. మదనపల్లి కి చెందిన పొత్తూరి మోహన్ కృష్ణమ నాయుడు అలియాస్ హనీ, మధుశ్రీగా సింగారించుకుని మగ మహారాజులను మాయ చేసిన కేటుగాడు అక్రమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో గుప్త నిధులు, దెయ్యాల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి రూ.లక్షలు వసూలు చేసి మధుశ్రీ, హనీ పేర్లతో మగాళ్లను ఆకర్షించిన మగరాయుడి కథేంటో మీరు చూడండి..!

మదనపల్లిలో నివ్వేర పరుస్తున్న పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
Madanapalle Honey Trap Scam

Edited By:

Updated on: Jun 18, 2026 | 7:24 AM

పొత్తూరి మోహన కృష్ణమ నాయుడు. వయస్సు 30 ఏళ్ళు. మదనపల్లిలోని శివాజీ నగర్ లో నివాసం. ఇంటర్ దాకా చదివిన మోహన కృష్ణమ నాయుడు ఆడవేషం ధరించి అందాలు ఆరబోయడంలో దిట్ట. చీర కట్టులోనే కాదు మోడరన్ డ్రెస్సుల్లోనూ మగాళ్ళను ఆకర్షిస్తూ స్త్రీ వేషధారణలో తిరుగుతూ మోసాలకు పాల్పడటమే వృత్తి. మధుశ్రీ అలియాస్ హనీగా హనీ ట్రాప్ చేస్తున్న మోహన కృష్ణమ నాయుడు నమ్మించి మోసం చేసిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మహిళగా వేషం మార్చి మోసాలు చేయడమే కాదు నమ్మే వాళ్ళ ఇళ్లను గుల్ల చేయడంలోనూ దిట్టగా మధు శ్రీ అలియాస్ హనీ నేరాలకు పాల్పడుతూ వచ్చింది. గుప్త నిధులు ఉన్నాయని, ప్రేతాత్మలు ఉన్నాయని భయపెట్టి మోసం చేయడంలో మధుశ్రీ అలియాస్ హనీ రాణించింది.

శాంతి పూజలు చేయాలంటూ నమ్మించి మోసాలకు పాల్పడటమే కాకుండా పెళ్లిళ్ల పేరిట లేడీ గెటప్ లో పలువురికి వలపు వేసి పెళ్లి చేసుకుని మోసాలకు పాల్పడింది. కొందరు యువకులను ట్రాప్ చేసి జీవితం బాగుండాలంటే తనలాంటి ఆడ మగ కాని వాళ్ళను పెళ్లి చేసుకోవాలని మాయమాటలు చెప్పి అయిన కాడికి దండుకున్న మోహన కృష్ణ నాయుడు మధుశ్రీ గా మారి మోసాలకు పాల్పడింది. యువకులను ఆకర్షించి కొందరి చేత తాళి కూడా కట్టించుకున్న మధు శ్రీ అలియాస్ హనీ మాయ లేడిగా చలామణి అయింది. గత కొంతకాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న మాయలేడి బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మదనపల్లి లోనే పదుల సంఖ్యలో బాధితులు ఉండగా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ మధు శ్రీ అలియాస్ హనీగా మారిన మోహన కృష్ణమ నాయుడిని మోహించిన వారి సంఖ్య నివ్వెర పరుస్తుంది. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ యవ్వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మాయ లేడిగానే కాదు మంత్రాలతోనూ మోసం…!

ఇక పడుచు పిల్లగా సింగారించు కోవడమే కాకుండా పెళ్లిళ్లు జరిగే చోట్లకు వెళ్లి దిష్టి తీస్తూ పలువురి దగ్గర అందిన కాడికి దోచుకోవడం లోనూ పొత్తూరి మోహన్ కృష్ణమ నాయుడు @ హనీ రాణించింది. మధుశ్రీగా
హనీ గా పోలీసులు, రాజకీయ నాయకులకు బాగా తెలిసిన మోహన కృష్ణమ నాయుడు వారితోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. తనను మోహించిన వారిని మోసం చేయడమే కాకుండా గుప్తనిధులున్నాయని, తాంత్రిక పూజలు పేరుతోనూ కొందరికి ట్రాప్ చేసిన మధు శ్రీ అలియాస్ హనీ పై ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాకపోవడం చర్చగా మారింది. కొందరు పోలీసు అధికారుల అండదండలు ఉండడంతోనే మాయలేడి అవతారంలో మాయల మరాఠీగా మోహనకృష్ణమనాయుడు రాణిస్తున్నట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై పోలీసు యంత్రాంగం స్పందించక పోవడం చర్చణీయాంశంగా మారింది.

Follow Us