Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు!

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే నిర్వహణ పనులల్లో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసిన పాతాళ గంగకు వెళ్లే టూరిజం రోప్ వే అధికారులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఇకపై ఈ మార్గంలో రూప్‌లే టూరిజం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు.

Srisailam Ropeway: శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్.. మళ్లీ ప్రారంభమైన రోప్‌వే సేవలు!
Srisailam Patala Ganga Ropeway Reopens

Edited By:

Updated on: Aug 28, 2026 | 8:47 AM

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు అధికారులు శుభవార్త చెప్పారు. నిర్వహణ పనుల్లో భాగంగా గత నెల పాటు ఆపేసిన పాతాళ గంగవైపు వెళ్లే టూరిజం రూప్‌వే సేవలను మళ్లీ అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగకు వెళ్ళే రోప్ వేని తిరిగి పున ప్రారంభించినట్లు రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు. రోప్ వే నిర్వహణ పనులలో భాగంగా గత 30 రోజులుగా నిలుపుదల చేసి నెల రోజులుగా రోప్ వే లోని క్యాబిన్స్, రోప్స్, మిషన్స్ మెయింటెనెన్స్ పనులు చేయించినట్లు తెలిపారు.

ఏపీ టూరిజం డెవలప్మెంట్‌లో భాగంగా ఈ రోప్ వే ప్రారంభించి సుమారు 20 సంవత్సరాలు పూర్తయిందని.. ప్రస్తుతం శ్రీశైలానికి భక్తుల తాకిడి స్వల్పంగా ఉన్న కారణంగా గత నెల 23 నుండి మెయింటెనెన్స్ పనులు చేశామని ఆయన తెలిపారు. దీనితో మరో 10 సంవత్సరాలు వరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఇవాళ్టి నుండి భక్తులు, పర్యాటకులు రోప్ వేని యథావిధిగా వినియోగించుకోవచ్చని ఏపీ టూరిజం రోప్ వే మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us