AP Train: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే..!

Andhra Pradesh: ప్రస్తుతం కుప్పంలో చాలా రైళ్లకు హాల్ట్ ఉంది. భవిష్యత్‌లో మరిన్ని రైళ్ల హాల్ట్‌లకు ప్రయత్నిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక కుప్పం ఎకనమిక్ హబ్‌ అవుతోందని, పెరిగిన రైల్వే హాల్ట్‌లతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందన్నారు. కుప్పంను ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసి..

AP Train: ఏపీ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లు అక్కడ ఆగాల్సిందే..!
Indian Railways

Edited By:

Updated on: Sep 23, 2026 | 10:30 AM

Andhra Pradesh: కుప్పం రైల్వే స్టేషన్‌ ఇకపై ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించ బోతోంది. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో బ్రేకులు పడేలా సీఎం చంద్రబాబు చేయడంతో రైల్వే స్టేషన్ మరింత రద్దీగా ఉండబోతోంది. ఇప్పటిదాకా ఆగని ఎక్స్ ప్రెస్ రైళ్లు కొన్ని ఇక అదనపు స్టాపింగ్ అనుమతి రావడం రావడంతో ప్రయాణికులకు మరింత మేలు జరగనుంది.. సీఎం చంద్రబాబు చొరవతో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు స్టాప్‌లు కావడంతో కుప్పం అభివృద్ధిలో మరో అడుగు ముందుకే సిన్నట్టు అయ్యింది. కుప్పం ప్రజల సౌకర్యార్థం రైల్వే బోర్డు తీసుకున్న కీలక నిర్ణయంతో నేటి నుంచే వాస్కోడ గామా–వేళాంగని వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు స్టాప్ అవుతున్నాయి. రైలు నంబర్ 17315 రాత్రి 12:33 గంటలకు కుప్పం చేరుకుని 12:35 గంటలకు బయలుదేరుతుంది.

అలాగే రైలు నంబర్ 17316 సెప్టెంబర్ 22 నుంచి కుప్పంలో నిలుస్తోంది. వేళాంగని –వాస్కో డ గామ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9:33 గంటలకు కుప్పంకు వచ్చి 9:35 గంటలకు బయలుదేరు తుంది. ఇక దాదర్–పుదుచ్చేరి వారానికి మూడుసార్లు వచ్చే ఎక్స్‌ప్రెస్‌కు కుప్పంలో అదనపు స్టాప్‌కు అనుమతి వచ్చింది. రైలు నంబర్ 11005 రాత్రి 10:45 గంటలకు కుప్పం కు చేరుకొని 10:47 గంటలకు బయలుదేరుతుంది.

ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఓపెన్‌ టాప్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు!

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కుప్పంలో చాలా రైళ్లకు హాల్ట్ ఉంది. భవిష్యత్‌లో మరిన్ని రైళ్ల హాల్ట్‌లకు ప్రయత్నిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక కుప్పం ఎకనమిక్ హబ్‌ అవుతోందని, పెరిగిన రైల్వే హాల్ట్‌లతో ప్రయాణికులకు సౌకర్యం కలుగుతుందన్నారు. కుప్పంను ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేసి, రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా మలుస్తామన్నారు. గుడిపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఆర్వోబీకి భూసేకరణ చేస్తున్నామని, డికె పల్లి చెరువు దగ్గర కూడా ఆర్వోబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బెంగళూర్-చెన్నై 4 లైన్ల రైల్వే లైన్ త్వరలోనే వస్తుందని, కుప్పం నుంచి చిత్తూరుకు కూడా కనెక్ట్ చేస్తే నేరుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు సీఎం. ఈ ప్రాంతం నుంచి రైల్ కార్గోకు కూడా పెద్దఎత్తున అవకాశాలు ఉన్నాయని పొగురుపల్లి దగ్గర డ్రై పోర్టుకు కనెక్ట్ చేసి కార్గో రవాణా మెరుగుపరుస్తా మన్నారు. సమీప భవిష్యత్‌లో బెంగళూర్ నుంచి అమరావతికి వందే భారత్ రైళ్లను నడిపేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు సీఎం.

ఇది కూడా చదవండి: LPG Gas: గుడ్‌న్యూస్‌.. గ్యాస్ సిలిండర్‌పై రూ.600 వరకు తగ్గింపు.. ఎక్కడో తెలుసా?

ఇది కూడా చదవండి: Gas Cylinder: గ్యాస్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఇలా చేయకుంటే అక్టోబర్‌ 1 నుంచి అదనపు ఛార్జీలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us