Chinta Mohan: దీపావళి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి : కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

|

Sep 11, 2021 | 6:51 PM

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు.

Chinta Mohan: దీపావళి పండుగ లోపు ఏపీకి కొత్త ముఖ్యమంత్రి : కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Chinta Mohan
Follow us on

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ ఆరోపించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారని చింతా జోస్యం చెప్పారు. దేశం, రాష్ట్రంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరమన్న చింతా మోహన్‌.. కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యమవుతుందన్నారు. దీపావళి పండుగ లోపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రతినిధిగా నియమితులవుతారని తెలిపారు.

సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడని చెప్పిన చింతా మోహన్‌.. “జగన్ బయటకు రాడు.. ఆయనకు కుర్చీ పోతుందన్న భయం, దిగులు ఆయనకు పట్టుకుంది”. అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ, దేశంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చింతా మోహన్‌ వెల్లడించారు.

ఏపీ ప్రజల్లో చైతన్యం రావాలి.. ఎన్నికల విధానంలో మార్పులు రావాలి అని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. పేదలకిచ్చే బియ్యాన్ని ప్రజాప్రతినిధులు 50 శాతం పక్కదారి పట్టిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు చింతా మోహన్. కుర్చీ పోతుందన్న దిగులుతో సీఎం జగన్ బయటకు రావటం లేదన్నారు.

సినిమా టికెట్లు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమా ? అని చింతా మోహన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, స్వప్రయోజనాల కోసం పాకులాడుతుందని ఆరోపించారు.

Read also: Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ ఆఫర్ .. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొస్తే.. !