చిత్తూరు జిల్లాలో రక్తసిక్తమైన రహదారులు.. రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి!

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చెర్లోపల్లి హైవే వద్ద టాటా ఏస్‌, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నగరి మండలం మండపం వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు మృతిచెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

చిత్తూరు జిల్లాలో రక్తసిక్తమైన రహదారులు.. రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి!
Road Accident

Edited By:

Updated on: Nov 04, 2026 | 8:20 AM

తిరుపతి / చిత్తూరు: చిత్తూరు జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాలలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం, ట్రాక్టర్ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను తవణంపల్లికి చెందిన బాలు, యాదమరికి చెందిన సందీప్, బీహార్‌కు చెందిన జీతేంద్రగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నగరి మండలం వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు యువకులు దుర్మరణం:

మరోవైపు నగరి మండలం మండపం వద్ద జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగి ఇద్దరు యువకులు అక్కడికక్కడే చల్లాచెదురుగా పడి దుర్మరణం చెందారు. మృతులు నగరి మండలం చింతలపట్టు గ్రామానికి చెందిన మదన్ కుమార్ (18), అజిత్ కుమార్ (18)గా పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగరి పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us