Madanapalle: సుపారీ ఇచ్చి మరీ కొడుకును ఖతం చేయించిన తండ్రి.. రీజన్ ఇదే

ప్రస్తుత సమాజంలో బంధాలు, బంధుత్వాలు కనిపించడం లేద . మన వాళ్లు భారం అయినా భరించలేని పరిస్థితి. వారు తప్పులు తెలుసుకునేలా చేసే ప్రయత్నాలూ లేవు. అడ్డు తొలగించుకోవడమే.

Madanapalle: సుపారీ ఇచ్చి మరీ కొడుకును ఖతం చేయించిన తండ్రి.. రీజన్ ఇదే
మృతుడు ఠాగూర్‌ నాయక్‌(File Photo)

Updated on: Aug 13, 2022 | 6:47 PM

Ap Crime News: కాలం మారే కొద్ది మనుషులు దారుణంగా మారుతున్నారు. రక్తసంబంధీకులనే కాదనుకుంటున్నారు. డ్రగ్స్‌కు బానిసై వేధిస్తున్నాడని, ఓ తండ్రి కన్నకొడుకునే హత్య చేయించాడు. ఇందుకు ఒకరికి సుపారీ కూడా ఇచ్చాడు. అన్నమయ్య జిల్లా(Annamayya district)లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈనెల 3న మదనపల్లి శివారు ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం చేపట్టిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన  విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రిని నిందితుడిగా తేల్చారు. తండ్రిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది.. డ్రగ్స్‌కు బానిసైన కొడుకు ఠాగూర్‌ నాయక్‌ను తానే హత్య చేయించినట్లు తండ్రి అంగీకరించాడు. కొడుకు హత్య చేసేందుకు బావమరిదితో కలిసి 2 లక్షలకు మర్డర్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రసుత్తం పోలీసుల అదుపులో ఉన్నారు నిందితులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us