Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్‌ బాడీలు! ఏం జరిగిందంటే..?

భార్య దీర్ఘకాలిక అనారోగ్యంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ దినసరి కూలీ, తన భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి అనంతరం తాను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎంలో డబ్బు ఉంచి, పిన్ నంబర్‌తో లేఖ రాసి పెట్టడం ఈ ఘటనలో కలచివేసే అంశంగా మారింది..

Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్‌ బాడీలు! ఏం జరిగిందంటే..?
Chittoor Family Suicide Case

Edited By:

Updated on: Jun 22, 2026 | 9:08 AM

చిత్తూరు, జూన్‌ 22: చిత్తూరులో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డి పల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. దినసరి కూలీలుగా పనిచేస్తున్న దాము, నిర్మల దంపతులుతోపాటు ఇద్దరు పిల్లల ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకెళ్తే..

దాము దినసరి కూలీ. మేస్త్రీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చేవాడు. భార్య నిర్మల ఇద్దరు పిల్లలు దిలీప్, శ్రీవిద్య పిల్లలతో కుటుంబం సంతోషంగానే ఉండేది. అయితే తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన భార్య నిర్మల ఏడాదిగా మంచానికి పరిమితమైంది. ఎన్నో ఆసుపత్రులకు చూపించిన దాము నిర్మల ఆరోగ్యం నయం కాదని వైద్యులు తేల్చి చెప్పడంతో దాము మనోవేదనకు గురైయ్యాడు. రెండు రోజుల క్రితం కూడా నిర్మలను ఆసుపత్రికి తీసుకెళ్లిన దాము ఇక బతకడం కష్టమని తేలిపోవడంతో కఠినమైన నిర్ణయానికి కుటుంబం వచ్చింది. ఇద్దరు పిల్లలు దిలీప్, శ్రీవిద్య, భార్య నిర్మలకు పురుగులు మందు తాగించిన దాము ఉరి బిగించి కుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబం మొత్తం ఆత్మహత్య కు పాల్పడగా ఇక అంత్యక్రియలకు ఎవరికి భారం కాకుండా కావలసిన డబ్బు ఏటీఎంలో ఉంచాడు. ఈ మేరకు ఏటీఎం పిన్ నెంబర్ తో లెటర్ రాసి పెట్టి ఆ పేపర్ ను టీవీకి అతికించిన దాము భార్య ఇద్దరు పిల్లలు మృతి చెందాక తాను కూడా ఉరివేసుకొని చనిపోయాడు. గ్రామంలోనే కాకుండా పనిచేసే చోట అందరితో కలివిడి గా ఉండే దాము తీసుకున్న కఠిన నిర్ణయం ఒకే కుటుంబంలో నలుగురు మృతి కి కారణం అయ్యింది. దీంతో గ్రామంలో విషాదం చేసుకోగా ఘటన స్థలాన్ని పరిశీలించిన చిత్తూరు తాలూకా సిఐ రామచంద్ర ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టారు. డెడ్ బాడీలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us