Extramarital Affairs: భార్యకోసం భర్త వినూత్న నిరసన .. భార్య ప్రియుడిని ఊరేగిస్తూ చెప్పు దెబ్బలతో సన్మానం..

పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటూ ప్రియుడి మోజులో వెళ్ళిపోయిన భార్యకు ఓ భర్త వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన భార్యను ఓ వ్యక్తి ఎత్తుకుపోయాడంటూ చాటింపు వేయించాడు. ఈ విచిత్ర సంఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.

Extramarital Affairs: భార్యకోసం భర్త వినూత్న నిరసన .. భార్య ప్రియుడిని ఊరేగిస్తూ చెప్పు దెబ్బలతో సన్మానం..
Vinta Nirasana

Updated on: Jun 18, 2023 | 10:28 AM

ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన భార్యాభర్తల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి అక్రమ సంబంధాలు.. సమాజంలో రోజు రోజుకీ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో అందంగా సాగుతున్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు భార్యాభర్తలు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకుంటూ ప్రియుడి మోజులో వెళ్ళిపోయిన భార్యకు ఓ భర్త వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన భార్యను ఓ వ్యక్తి ఎత్తుకుపోయాడంటూ చాటింపు వేయించాడు. ఈ విచిత్ర సంఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి ఫోటోకి చెప్పుల దండ వేసి ఊరేగిస్తూ డప్పుతో చాటింపు వేయించాడు. వివరాల్లోకి వెళ్తే..

మడకశిర మండలం క్యాంపురం గ్రామానికి చెందిన అంజి, నేత్రావతి భార్యాభర్తలది పచ్చని సంసారం.  ఉన్నట్టుండి భార్య నేత్రావతి కనిపించకుండా పోయింది. దీంతో తన భార్యను ఆమె ప్రియుడు దివాకర్‌ అనే వ్యక్తి తీసుకెళ్లిపోయాడని ఆరోపిస్తూ నిరసనకు దిగాడు. అది కూడా వింతగా తన నిరసన తెలిపాడు.

ఇందులో భాగంగా అంజి, దివాకర్‌ ఫోటోను సైకిలుకి కట్టి, చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగిస్తూ తన భార్యను దివాకర్‌ ఎత్తుకుపోయాడంటూ చాటింపు వేయించాడు. అంతేకాదు స్థానికులందరితో ఆ ఫోటోను చెప్పులతో కొట్టించాడు. దివాకర్‌పై కోపంతో రగిలిపోయిన అంజి గ్రామస్తులతో తన ఆవేదనను ఇలా వెల్లబోసుకున్నాడు. దీంతో అంజి బాధను అర్ధం చేసుకున్న గ్రామస్తులు దివాకర్‌ ఫోటోపై ఉమ్మి వేస్తూ చెప్పులతో కొడుతూ అంజి నిరసనకు మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us