
గత 24 గంటలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్యల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే ఈ క్రమంతో శుక్రవారం సాయంత్రం రాయచోటిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్ విద్యార్థులతో వస్తున్న ఒక ఆటో వర్షపు నీటిలో మునిగిపోయింది.దీంతో ఆటోలో ఉన్న విద్యార్థులు, ఆటో డ్రైవర్ కాపాడామని కేకలు వేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నీటిలో చిక్కుకున్న ఆటలో ఉన్న ఆరుగురు విద్యార్థులను సురక్షితంగా కాపాడి పైకి తీసుకొచ్చారు. కానీ ప్రమాదవశాత్తు ఒక ఎనిమిదేళ్ల బాలిక వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం సమీపం ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.q