Andhra: ఇదిగో పెద్దపులి.. పూరిపాకలో నక్కి గాండ్రింపులు.. వీడియో చూశారా..?

తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజులుగా టైగర్ టెన్షన్ కొనసాగుతుంది. గత వారం రోజులుగా రోజుకో ప్రాంతంలొ తిరుగుతూ టెన్షన్‌ పెడుతుంది పులి.. సీతానగరం మండలం చిన్నకొండేపూడి నుంచి మొదలై.. తొర్రేడు, గాడాల, దివాన్ చెరువు, నామవరం, భూపాలపట్నం మీదుగా జీ ఎర్రంపాలెం.. కూర్మాపురం వరకు చేరింది పెద్దపులి..

Andhra: ఇదిగో పెద్దపులి.. పూరిపాకలో నక్కి గాండ్రింపులు.. వీడియో చూశారా..?
Tiger

Updated on: Feb 06, 2026 | 4:10 PM

తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజులుగా టైగర్ టెన్షన్ కొనసాగుతుంది. గత వారం రోజులుగా రోజుకో ప్రాంతంలొ తిరుగుతూ టెన్షన్‌ పెడుతుంది పులి.. సీతానగరం మండలం చిన్నకొండేపూడి నుంచి మొదలై.. తొర్రేడు, గాడాల, దివాన్ చెరువు, నామవరం, భూపాలపట్నం మీదుగా జీ ఎర్రంపాలెం.. కూర్మాపురం వరకు చేరింది పెద్దపులి.. ఇప్పటికే తొమ్మిది పశువులను బెబ్బులి బలి తీసుకుంది. పులి వరుస దాడులు చేస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణుకుతున్నారు. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్దపులి పరుగులు తీస్తున్న విజువల్స్ స్థానికులు క్యాప్చర్‌ చేశారు. పాడుబడిన ఇంట్లోకి పెద్దపులి వెళ్లిపోయిందని చెప్తున్నారు స్థానికులు. పాడుపడిన ఇంట్లో పెద్దపులి గాండ్రింపులు వినిపించాయంటూ ఫారెస్ట్‌, పోలీసులకు స్థానికులు కంప్లైంట్ ఇచ్చారు.. దీంతో కూర్మాపురం చేరుకున్న రెస్క్యూ టీం, పోలీసులు.. సమీప ప్రాంతంలో పులి పాదముద్రలు పరిశీలిస్తున్నారు. పులి కోసం పుణె, ఢిల్లీ, హైదరాబాద్ రెస్క్యూ టీమ్స్ సర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

వీడియో చూడండి..

రాయవరం మండలం కూర్మాపురంలఒక పూరిపాకలోకి పెద్దపులి వెళ్లినట్లు గుర్తించారు. పంట పొలాల్లోంచి జనావాసాల మధ్యలో ఇళ్లలోకి వచ్చేసిన పెద్దపులి. పూరిపాకలో నక్కింది. దీంతో కూర్మాపురం గ్రామస్థులు భయంతో ఇళ్లపైకి ఎక్కారు.