Nellore Politics: దాడికి వస్తే ట్రెస్‌పాస్‌ సెక్షన్లు పెడతారా..? భగ్గుమన్న టీడీపీ నేతలు..

Nellore Politics: నెల్లూరులో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నిస్తే.. కేవలం ట్రెస్‌పాస్‌ కేసులు పెడతారా అని FIR కాపీని చించేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ప్రశాంతమైన నెల్లూరులో సుపారీ సంస్కృతి ఏంటని ప్రశ్నించారు ఆనం.

Nellore Politics: దాడికి వస్తే ట్రెస్‌పాస్‌ సెక్షన్లు పెడతారా..? భగ్గుమన్న టీడీపీ నేతలు..
Nellore Politics

Updated on: Jun 05, 2023 | 9:37 PM

Nellore Politics: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించడంతో నెల్లూరు జిల్లా పాలిటిక్స్‌లో అటెన్షన్‌ క్రియేట్‌ అయ్యింది. టీడీపీ సీనియర్లు ఆనం ఇంటికి క్యూ కట్టారు. తమ నేతకు సంఘీభావం తెలియజేశారు. దాడి జరిగి 24 గంటలు దాటాక కూడా FIR లేదా అని ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. పోలీస్‌ వ్యవస్థ సిగ్గుపడాలన్నారు. పార్టీ నాయకులతో వెళ్లి జిల్లా ఎస్పీని కలిశారు. కేవలం ట్రెస్‌పాస్‌ సెక్షన్లే ప్రస్తావించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమా.. FIR కాపీని చించేశారు. ఆనంను పరామర్శించిన అనంతరం టీడీపీ నేతలు జిల్లా ఎస్పీతోనూ మాట్లాడారు.

ప్రశాంతమైన నెల్లూరులో సుపారీ సంస్కృతి ఏంటని ప్రశ్నించారు ఆనం వెంకటరమణారెడ్డి. వైసీపీ దాడులకు తాము భయపడబోమని, దాడులు తాము కూడా చేయగలం అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ఫైర్ అన్నారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ విమర్శించారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదని.. తాము కూడా దాడులు చేయగలం అంటూ హెచ్చరించారు.

తాజా ఘటనతో నెల్లూరు టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు. ఈ సమస్యపై వివిధ వేదికలపై పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా నెల్లూరు పాలిటిక్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..