
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో బుధవారం (03-12-2025) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(జి) మల్లంలో 53.5 మిమీ, తడలో 50.7 మిమీ, చిత్తమూరులో 50.2మిమీ, పూలతోటలో 33.5మిమీ వర్షపాతం నమోదైందని తెలిపింది.
అయితే ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై ఉండదని.. వాతావరణం వచ్చే 2, 3 రోజులు చాలావరకు స్థిరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కానీ డిసెంబర్ 8 వరకు హైదరాబాద్ నగరంలో ఉదయం తేలికపాటి పొగమంచు.. మధ్యాహ్నం సమయాల్లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. సో.. తెలంగాణకు ఎలాంటి రెయిన్ అలర్ట్ లేదు. శీతాకాలం చలి విజృంభించే చాన్సులు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.