
చేపలు పట్టేందుకు వెళ్లిన యువకులకు ఊహించని షాక్ ఎదురైంది. సాధారణంగా చేపల వేట అంటే సైలెంట్‌గా ఉండాలి అంటారు. కానీ ఈసారి మాత్రం కేకలు, పరుగులు, బుసలు కూడా కలగలిసాయి. స్థానికంగా ఉన్న ఓ మడుగులో నీరు తక్కువగా ఉండటంతో కొంతమంది యువకులు చేతులతోనే చేపలు పట్టడం ప్రారంభించారు. నీటిలోకి దిగి ఒక్కో చేపను పట్టి ఒడ్డుకు విసురుతున్నారు. ఇదే క్రమంలో ఇద్దరు యువకులు కలిసి ఓ చేప పట్టుకున్నామనుకొని… ఒక్కసారిగా లాగి బయటకు విసిరేశారు. కానీ అదేం చేప కాదు… నాగుపాము..!ఒక్కసారిగా నేలపై పడిన పాము వెంటనే పడగ విప్పి బుసలు కొట్టింది. దీంతో యువకులు దూరంగా పరుగులు తీశారు. కొద్దిసేపు కోరలు భయపెడుతూ పాము నీటిలోకి వెళ్లిపోయింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు.
Also Read: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
ఈ తతంగాన్ని అక్కడే ఉన్న వారు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగుపాములు నీటిలో ఈత కొడతాయి. పాము తాపం నుంచి సేద తీరడానికి.. లేదా కప్పల్ని వేటాడుతూ ఆ నీటి వద్దకు వచ్చి ఉండొచ్చని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదరైందా..? అయితే కామెంట్ చేయండి.
వీడియో దిగువన చూడండి…