టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు 75ఏళ్లు ముసలివ్యక్తి.. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతోందని అన్నారు. ఈ వయసులో కుప్పంలో ఇల్లుకట్టుకుంటారట.. 35ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటానంటున్నారు చంద్రబాబు అని అటూ ఎద్దేవ చేశారు. కుప్పంలో పేదలకు ఇళ్లు కట్టిస్తోంది మా ప్రభుత్వం అని అన్నారు. చంద్రబాబు మద్దతుదారులపై కూడా జగన్ విమర్శలు గుప్పించారు. 1995-2004 వరకు చంద్రబాబు చిత్తూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. బాబు భజన పార్టీలు, బృందాలు గుర్తుచేసుకోవాలన్నారు. కుప్పం ప్రజలు బైబై బాబు అంటున్నారని సెటైర్లు వేశారు. పప్పూ బెల్లానికి చంద్రబాబు రాష్ట్రవ్యాప్త డెయిరీలు అమ్మేశారని.. అమ్మింది కూడా దేవేందర్‌గౌడ్, నామా లాంటి సొంతమనుషులకే అని అన్నారు. తన వాళ్లకు సంస్థలను అమ్ముకుని ముడుపులు తీసుకున్నారని విమర్శించారు చంద్రబాబు.
దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు ఇక్కడి నుంచి 2 మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏనాడో మూతబడిన అతి పెద్ద డెయిరీ.. చిత్తూరు డెయిరీని ఈ రోజు తెరిపించేందుకు నాంది పలుకుతున్నామన్నారు సీఎం జగన్.
దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజీల్లో ఒకటైన వెల్లూర్ సీఎంసీ, వెల్లూర్ మెడికల్ కాలేజీకి ఆనాడు దివంగత నేత రాజశేఖరరెడ్డి స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చేందుకు కలగన్నారు. ఆ మెడికల్ కాలేజీ నిర్మాణానికి 14 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయన బిడ్డ ఈ రోజు పునాది రాయి వేస్తున్నాడని గుర్తుచేశారు..
ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డెయిరీ ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించేవి. అదే చిత్తూరు డెయిరీని 2022లో కుట్ర పూరితంగా మూసేశారన్నా అని చెప్పిన మాటలు నా కు ఈరోజుకూ గుర్తున్నాయి.
1945లో చిల్లింగ్ ప్లాంట్‌గా ఏర్పాటైన చిత్తూరు డెయిరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపించాయి. 1989-1993 మధ్యలో చిత్తూరు డెయిరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డెయిరీ చేరుకుంది. 1993 వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలో ఈ జిల్లా ఖర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కళ్లు పడ్డాయి.