CM Chandrababu: వ్యాపారులకు సీఎం చంద్రబాబు దివాళి గిఫ్ట్.. పెండింగ్ ప్రోత్సహకాల విడుదలకు నిర్ణయం

రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా పరిశ్రమలకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను క్లియర్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి విడతగా రూ. 1,500 కోట్లను నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

CM Chandrababu: వ్యాపారులకు సీఎం చంద్రబాబు దివాళి గిఫ్ట్.. పెండింగ్ ప్రోత్సహకాల విడుదలకు నిర్ణయం
Cm Chandrababu

Updated on: Oct 19, 2025 | 6:32 PM

దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ వేస్తూ నిన్నే నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళ రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పరిశ్రమలకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను క్లియర్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి విడతగా రూ. 1,500 కోట్లను నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీకగా దీపావళి పండగను చేసుకుంటామని.. ఈ స్ఫూర్తితోనే పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా.. పారిశ్రామిక రంగానికి అండగా నిలబడాలన్న నిబద్ధతతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యాపారానికి అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us