CM Chandrababu: దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..

|

Nov 01, 2024 | 9:46 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

CM Chandrababu: దీపం 2.0 పథకానికి శ్రీకారం.. స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు.. బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు..
Cm Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, ఎంత మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి టీ తాగారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అదే వీధిలో మరో ఒంటరి మహిళకు పెన్షన్ పంపిణీ చేశారు.

CM Chandrababu

అంతకు ముందు.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ దగ్గర బస్సులో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వీడియో చూడండి..

తొలి ఏడాది ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి 2684 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తొలి విడత కోసం 894కోట్ల రూపాయల చెక్‌ను పెట్రోలియం సంస్థలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలోని వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఎలాంటి మేలు చేకూర్చలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారులు అందిస్తుందని పేర్కొన్నారు. తాను తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని.. అలాగని రాజకీయ కక్షసాధింపులకు పోనని తెలిపారు. అనంతరం శ్రీకాకుళంలో జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

వీడియో చూడండి..

ఈ రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్నారు చంద్రబాబు.. రేపు విజయనగరం జిల్లాలో రోడ్ల మరమ్మతు పనులకు శ్రీకారం చుడతారు. గజపతినగరం మండలం పురిటిపెంట దగ్గర రోడ్డుపై గుంతలను పూడ్చే పనుల్లో స్వయంగా పాల్గొంటారు సీఎం. రేపు సాయంత్రం భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పురోగతిని పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..