Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే.. అస్సలు ఊహించలేదుగా

మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు ఏ శాఖలు ఇవ్వాలన్న విషయంపై సుధీర్ఘ సమాలోచనలు చేశారు. పవన్‌కు ఆసక్తి ఉన్న శాఖలు ఏంటో కూడా అడిగి తెలుసుకున్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖలు ఇవే.. అస్సలు ఊహించలేదుగా
Pawan Kalyan

Updated on: Jun 13, 2024 | 4:26 PM

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ, జనసేన, కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. ఈ కూటమి కలయికతో పాటు గెలుపులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషించారు. అంతేకాదు ఆ పార్టీ 100 శాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో (21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు) విజయం సాధించింది. చంద్రబాబు కేబినెట్లో జనసేనకు 3 పోస్టులు కేటాయించారు. జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం పోస్ట్ కన్ఫామ్ అయింది. వాటితో పాటు ఇంకా ఏ శాఖలు కేటాయిస్తారు అన్న అంశంపై స్పష్టత వీడింది.

పవన్‌ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేయడంతోపాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలిసింది. నాదెండ్ల మనోహర్‌కు సివిల్ సప్లయిస్, కందుల దుర్గేష్‌కు టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్టు సమాచారం. పవన్‌ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మరికొద్దిసేపట్లో శాఖలకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..