CM Jagan: ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంగళవారం రైతు భరోసా నగదు విడుదల.. వారికి కూడా 76 కోట్ల నగదు..

|

Feb 27, 2023 | 9:48 PM

ఏపీ రైతులకు మరో శుభవార్త. YSR రైతు భరోసా - పీఎం కిసాన్‌ - YSR సున్నావడ్డీ పంట రుణాలు, YSR యంత్ర సేవా పథకం కింద రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌. మంగళవారం తాడేపల్లి నివాసంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్‌.

CM Jagan: ఏపీ రైతులకు మరో శుభవార్త.. మంగళవారం రైతు భరోసా నగదు విడుదల.. వారికి కూడా 76 కోట్ల నగదు..
Cm Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లాలోని తెనాలిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాలుగో ఏడాది మూడో విడతలో భాగంగా వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు. ఈ వివిధ రకాల పథకాల వల్లా రైతులు ఆర్ధికంగా బలపడి పంటలను సాగు చేస్తున్నారు. దీంతో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణి చేస్తున్నారు. పంటకు వాడే ఎరువులపై సబ్సిడీలను అందించడం ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. తాజాగా మరో శుభవార్త చెప్పారు సీఎం జగన్..

వైఎస్‌ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్‌ – వైఎస్‌ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు, వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద 2వేల190 కోట్ల రూపాయలు రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఆగస్టులో రెండో విడత వైఎస్‌ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద జమ చేసిన 977 కోట్లు పోనూ.. మిగిలిన మొత్తం 1213 కోట్లు బటన్‌ నొక్కి రైతుల ఖాతాలో జమచేయనున్నారు సీఎం జగన్‌.

ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్‌ ఇలా..

సీఎం జగన్‌ మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం