AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poultry: గిన్ని కోడిని.. నాటు కోడి పుంజు క్రాస్ చేస్తే.. దాని పిల్లలు ఎలా ఉంటాయి.. ?

ఒకే పరిసరాల్లో వేర్వేరు జాతుల పక్షులను పెంచుతున్నప్పుడు హైబ్రిడ్ పక్షులు పుడతాయన్న భావన కొందరిలో ఉంటుంది. ముఖ్యంగా నాటుకోడి–గిన్ని కోడి మధ్య హైబ్రిడైజేషన్ కొన్ని సందర్భాల్లో జరిగినట్లు పల్లెటూర్లలో చెప్పడం మనం వింటూ ఉంటాం. ఇది నిజమేనా..? అపోహనా..? ఈ కథనంలో తెలుసుకుందాం ...

Poultry: గిన్ని కోడిని.. నాటు కోడి పుంజు క్రాస్ చేస్తే.. దాని పిల్లలు ఎలా ఉంటాయి.. ?
Bird Breeding
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2026 | 9:00 PM

Share

పెంపుడు జంతువులు, పక్షుల పెంపకం అనేది చాలామందికి ఆసక్తికరమైన కాలక్షేపం. చికెన్లతో పాటు టర్కీ కోళ్లు, గిన్ని కోళ్లు, క్వయిల్ పక్షులు, బాతులు వంటి విభిన్న జాతుల పక్షులను చాలామంది ఒకే పరిసరాల్లో పెంచుతుంటారు. ముఖ్యంగా గిన్ని కోళ్లు వాటి ప్రత్యేకమైన రూపం, గుంపులుగా తిరిగే స్వభావం వల్ల చాలామందిని ఆకర్షిస్తాయి. అయితే ఒకే ప్రదేశంలో వేర్వేరు జాతుల పక్షులు కలిసి పెరిగినప్పుడు, వాటి మధ్య సహజ సంకరణం జరుగుతుందా? నిజంగా హైబ్రిడ్ పక్షులు పుడతాయా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ సందర్భంలో శాస్త్రీయ వాస్తవాలు తెలుసుకోవడం అవసరం.

హైబ్రిడైజేషన్ అంటే సన్నిహిత సంబంధం ఉన్న రెండు జాతులు కలిసి సంకరం చేసుకోవడం ద్వారా సంతానం పుట్టడం. ఈ సంతానం తల్లిదండ్రుల రెండింటి లక్షణాలను కొంతవరకు కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అన్ని జాతుల మధ్య జరగదు. నాటుకోడి, గిన్ని కోడి మధ్య హైబ్రిడ్ పక్షులు పుడతాయన్న భావన శాస్త్రీయంగా తప్పు. నాటుకోడి, గిన్ని కోడి ఈ రెండూ వేర్వేరు జెనస్, వేర్వేరు క్రోమోజోమ్ నిర్మాణం కలిగిన పక్షులు. అందువల్ల వీటి మధ్య సహజ సంకరణం జరిగి, జీవించగల పిల్లలు పుట్టడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మగ పక్షి,ఆడ పక్షి మధ్య మేటింగ్ ప్రయత్నం జరిగినా, ఫర్టిలైజేషన్ జరగదు లేదా గుడ్లలో ఎంబ్రియో అభివృద్ధి ప్రారంభ దశలోనే ఆగిపోతుంది.

అయితే కొన్ని చోట్ల కోడి లాంటి రెక్కలు, గిన్ని కోడి లాంటి ముఖం ఉన్న పక్షులు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడా తారసపడుతూ ఉంటాయి. గిన్ని కోడి పిల్లలు చిన్న వయసులో కొంతవరకు కోడి పిల్లలను పోలి ఉండటం, కొన్ని స్థానిక కోడి జాతులు సహజంగానే భిన్నంగా కనిపించడం, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాల వల్ల వాటిని హైబ్రిడ్ పక్షులుగా భావిస్తారు. కానీ ఇప్పటివరకు కోడి–గిన్ని కోడి హైబ్రిడ్ పుట్టిందని శాస్త్రీయంగా నిర్ధారించిన ఉదాహరణ ఒక్కటీ లేదు.

అయితే ఒకే జాతికి చెందిన వేర్వేరు కోడి బ్రిడ్స్, ఒకే రకం బాతుల మధ్య, కొన్ని దగ్గర సంబంధం ఉన్న పక్షి జాతుల మధ్య హైబ్రిడైజేషన్ సాధ్యమయ్యే సందర్భాలు ఉంటాయి. అయితే వీటిలో చాలావరకు సంతానోత్పత్తి చేయలేని పక్షులే అవుతాయి. ఒకే ప్రదేశంలో వేర్వేరు పక్షులను పెంచుతున్నామనే కారణంతో వాటి మధ్య హైబ్రిడ్ పక్షులు పుడతాయన్న భావన సరైనది కాదు. ముఖ్యంగా కోడి, గిన్ని కోడి మధ్య హైబ్రిడ్ సాధ్యం కాదు. ఈ విషయంలో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకోవడం పెంపకందారులకు ఎంతో అవసరం.

(ఈ కథనం కోళ్ల పెంపకందారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు, అవగాహన కోసం ఇవ్వబడింది)

Follow Us
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..
ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..