Jagan-Chevireddy: నేడు సీఎం జగన్ పుట్టిన రోజు.. ఆర్గానిక్ ఆర్ట్‌తో శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే చెవిరెడ్డి..

Jagan-Chevireddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో..

Jagan-Chevireddy: నేడు సీఎం జగన్ పుట్టిన రోజు.. ఆర్గానిక్ ఆర్ట్‌తో శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే చెవిరెడ్డి..
Chevireddy Jagan

Updated on: Dec 21, 2021 | 7:09 AM

Jagan-Chevireddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలను ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలోని  గోశాల ముందు ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రాన్ని రూపొందించారు.

ఐడి దేశంలో నే తొలి ఆర్ట్ ఫార్మింగ్ తో  చిత్రం కావడం విశేషం. ఆర్గానిక్ జగన్ చిత్రాన్ని ఆర్టిస్ట్ కాంత్ రీషా ఏర్పాటు చేశారు. ఈ ముఖ చిత్రం ఏర్పాటు కోసం గత పది రోజుల నుంచి చెవిరెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసు వద్దనే ఉన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలోనే సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద పనులు చేయించారు. డ్రోన్‌పై నుంచి చూస్తే సీఎం జగన్‌ ముఖచిత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

 

Also Read:   ఈరోజు ఈ రాశివారు వాహనం కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us