Andhra News: అర్థరాత్రి ఫామ్‌ హౌస్ నుంచి అదేపనిగా అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజండ్ల అడ్డరోడ్డులో ఇటీవలే నిర్మించిన ఓ ఫామ్ వ్యవహారం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫామ్‌ హౌస్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని..అలాగే ఫామ్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణులు రావడంతో..తనిఖీలకు వెళ్లిన పోలీసులపై సైతం యజమాని దౌర్జన్యానికి దిగడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Andhra News: అర్థరాత్రి ఫామ్‌ హౌస్ నుంచి అదేపనిగా అరుపులు.. ఏంటని వెళ్లి చూడగా
Chebrolu Farm House

Edited By:

Updated on: Jul 10, 2026 | 7:36 PM

గుంటూరు జిల్లాలో ఇటీవలే కొత్త ప్రారంభించిన ఓ ఫామ్‌హౌస్ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. చేబ్రోలు మండలం వేజండ్ల అడ్డరోడ్డు వద్ద గరికపాటి గార్డెన్స్ ఉంది. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య ఉన్న ఈ గార్డెన్స్ లో సాయి కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్థలంలో అధునాతన హంగులతో ఓ ఫామ్ హౌస్ నిర్మించాడు. దానికి రూడీ నివాస్ అనే పేరు పెట్టాడు. గత నెల పదిహేడో తేదిన ఈ ఫామ్ హౌస్ ను ప్రారంభించాడు. కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే అద్దె అంటూ ఇన్ స్టాగ్రాంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. గుంటూరు – తెనాలి మార్గంలో ఉన్న ఫామ్ హౌస్ లో అన్ని హంగులుండటంతో ప్రతి రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అయితే రాత్రి వేళల్లో మీతి మీరిన సౌండ్స్ తో పాటలు పెట్టడం, యువకులు వెచ్చల విడిగా మద్యం సేవించి బైక్ లపై చక్కర్లు కొట్టడం చేయడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది.

మొదట రూడీ నివాస్ యజమానిని స్థానికులు ప్రశ్నించడంతో ఉదయ్ కుమార్ అనే వ్యక్తిపై సాయి అతని అనుచరులు దాడి చేశారు. మహిళలు కూడా వస్తుండటంతో స్థానికులు 112 నంబర్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఫామ్ హౌస్ వద్దకు వచ్చిన పోలీసులపై కూడా సాయి దౌర్జన్యానికి దిగాడు. దీంతో ఫామ్ వివరాలను పోలీసులు సేకరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు తేల్చారు. దీంతో సాయిపై రెండు కేసులు చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి.

అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ ఏర్పాటు చేసి ఇల్లీగల్ కార్యక్రమాలకు పాల్పడుతున్న సాయి ప్రశ్నించిన పోలీసులపై కూడా దాడికి పాల్పడటంతో అతని కోసం ప్రత్యేకంగా బృందాలను నియమించి గాలిస్తున్నారు. సాయి ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. త్వరలోనే అతనిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చేందుకు పంచాయితీ అధికారులు సిద్దమయ్యారు. ఆధునిక సంస్క్రుతిలో భాగంగా ఈ తరహా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఊపేక్షించవద్దని వెంటనే తమ ద్రుష్టికి తీసుకురావాలని పోలీసులు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us