Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP: వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు, చేర్పులు పూర్తి.. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కొత్త ముఖాలు

అధిష్ఠానం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక, నిన్నటికి నిన్న సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సడెన్‌గా స్వరం మార్చారు. తాను జగన్‌ను ఒక్క మాటా అనలేదనీ..

YCP: వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పు, చేర్పులు పూర్తి.. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కొత్త ముఖాలు
CM YS Jagan
Follow us
Subhash Goud

|

Updated on: Jan 10, 2024 | 12:20 PM

ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అధికారపార్టీ మార్పులు చేర్పుల అంశం తుది అంకానికి చేరుకుంది. మరి కొన్ని గంటల్లో మూడో జాబితా విడుదల కాబోతోంది. ఈలోపు ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు.. సీఎం ఆఫీసుకు క్యూ కడుతున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… మార్పులు చేర్పుల విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది వైసీపీ. ఇప్పటికే రెండు విడతల్లో 40 మంది దాకా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన అధికార పార్టీ.. ఇంకొన్ని గంటల్లో 29మందితో మరో జాబితాను రిలీజ్‌ చేయనుంది. దీనిపై పలువురు నేతలతో చర్చించిన సీఎం జగన్‌.. భారీ కసరత్తే చేసినట్టు తెలుస్తోంది. క్యాంప్‌ ఆఫీసుకు నేతలు క్యూ కట్టారు. ఈ లిస్టులో మంత్రులు బొత్స, బుగ్గన, జయరాం.. ఎంపీలు సత్యవతి, గోరంట్ల మాధవ్‌ ఉన్నారు. తోట త్రిమూర్తులు, ద్వారంపూడి, అయోధ్యరామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, తెల్లం బాలరాజు కూడా ముఖ్యమంత్రిని కలిశారు.

అధిష్ఠానం నిర్ణయంపై కొందరు విధేయత ప్రకటిస్తుంటే.. మరికొందరు తమదారి తాము చూసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ అధిష్ఠానంపై ధిక్కార స్వరం వినిపించిన కాపు రామచంద్రారెడ్డి.. మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈసారి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఇక, నిన్నటికి నిన్న సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. సడెన్‌గా స్వరం మార్చారు. తాను జగన్‌ను ఒక్క మాటా అనలేదనీ.. కేవలం అధికారుల తీరుపైనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమన్నారు ఎంపీలు గోరంట్ల మాధవ్‌, నందిగం సురేష్‌.

అటు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైనా వైసీపీ కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. ముగ్గురు సభ్యులను దాదాపు ఖరారు చేసిన వైసీపీ.. ఓసీ వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గొల్ల బాబురావు, బలిజ వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్‌ని ఎంపిక చేసింది. అయితే రాబోయే జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు పోతాయన్నది ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి