Andhra Pradesh: ఖాతాల్లో డబ్బు ఖాతాల్లోనే ఖతం.. అకౌంట్లలో నగదు స్వాహా.. లబోదిబోమంటున్న బాధితులు

|

Sep 17, 2022 | 6:43 AM

బ్యాంకుల్లో డబ్బులు దాచుకుని నిశ్చింతగా ఉండొచ్చనుకునే రోజులు పోయాయి. డిజిటలైజేషన్‌ ఎంత మంచి చేసిందో, అంతే ఇబ్బందులు తెచ్చిపెడుతోందనడానికి ఈ ఉదాహరణే ప్రత్యక్ష సాక్ష్యం. బ్యాంకులో డబ్బులున్నాయ్‌..

Andhra Pradesh: ఖాతాల్లో డబ్బు ఖాతాల్లోనే ఖతం.. అకౌంట్లలో నగదు స్వాహా.. లబోదిబోమంటున్న బాధితులు
debited from accounts
Follow us on

బ్యాంకుల్లో డబ్బులు దాచుకుని నిశ్చింతగా ఉండొచ్చనుకునే రోజులు పోయాయి. డిజిటలైజేషన్‌ ఎంత మంచి చేసిందో, అంతే ఇబ్బందులు తెచ్చిపెడుతోందనడానికి ఈ ఉదాహరణే ప్రత్యక్ష సాక్ష్యం. బ్యాంకులో డబ్బులున్నాయ్‌ అనుకున్నారు అంబేడ్కర్‌ (Ambedkar Konaseema) కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం అంగర ఎస్బీఐ బ్రాంచ్‌ ఖాతాదారులు. కానీ, ఖాతాల్లో డబ్బు ఖాతాల్లోనే ఖతం అయ్యిందన్న విషయం తెలిసి జనం గగ్గోలు పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా లక్షా 42 వేల రూపాయల సొమ్ము స్వాహా చేసేశారు ఘరానా మోసగాళ్ళు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అంగర SBI బ్రాంచ్ కు చెందిన 8 మంది ఖాతాదారుల అకౌంట్లో నుంచి సొమ్ము హఠాత్తుగా మాయం అవడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు. తమ ఖాతాల్లోని డబ్బు తమ ప్రమేయం లేకుండానే విత్ డ్రా అవడంతో అసలేం జరిగిందో అర్థం కాక ఖాతాదారులు కంగారు పడ్డారు. తమ ఖాతాల్లో డబ్బుని ఎవరో స్వాహా చేసినట్టు గుర్తించిన బాధితులు.. బ్యాంకుకు పరిగెత్తి లబోదిబోమన్నారు. అన్ని ఎకౌంట్లనూ తనిఖీ చేసిన బ్యాంకు అధికారులు.. జరిగిన మోసాన్ని పసిగట్టారు. ఖాతాదారులు వేలిముద్ర వేసి డబ్బులు విత్ డ్రా చేసుకునే కేంద్రాల ద్వారా సొమ్ము మాయమై ఉండవచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి, సైబర్ క్రైం విభాగానికి పంపించారు.

మరో ఘటనలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని ధర్మవరంలో ఖాతాదారులను మోసం చేసిన ఓ ప్రబుద్ధుడు వారి డబ్బును కాజేశాడు. ధర్మవరం బీపీఎం ఎస్‌కే మీరావలి స్థానికులకు నమ్మకస్థుడిగా పరిచయం పెంచుకున్నాడు. పోస్టాఫీసులో ఖాతా తీసుకున్న వారు అతనికి డబ్బు ఇచ్చి, ఖాతా పుస్తకంలో రాయించుకునే వారు. కానీ మీరావలి మాత్రం డబ్బును ఖాతాల్లో వేయకుండా తన స్వంత ఖర్చులకు వాడుకున్నాడు. ప్రజలకు నగదు విషయంలో తేడా రావడంతో విషయాన్ని అడిగారు. అతను బాధితుడికి రూ.4.50 లక్షలు ఇచ్చి, గొడవ చేయొద్దని చెప్పారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులందరూ పోస్టాఫీస్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..