వేటేస్తారా?…నాన్చుతారా?

YCPలో రఘురామకృష్ణంరాజు పంచాయితీ స్పీకర్‌ వద్దకు చేరింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్‌ ఇచ్చిన పార్టీ.. ఎంపీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలోనే షోకాజ్‌ నోటీస్‌..

వేటేస్తారా?...నాన్చుతారా?
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 10:17 PM

-రఘురామరాజుపై చర్యలు తీసుకునే దారేది? – రాజ్యాంగంలో ఏముంది? – పార్టీ మారకుండా విప్‌ ధిక్కరించకుండా వేటు సాధ్యమా?

YCPలో రఘురామకృష్ణంరాజు పంచాయితీ స్పీకర్‌ వద్దకు చేరింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ షోకాజ్‌ ఇచ్చిన పార్టీ.. ఎంపీపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. గతంలోనే షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చిన వైసీపీ.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం కంటే ముందే.. పదవి నుంచి తప్పించేందుకు ప్లానేసింది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేసింది వైసీపీ. విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్లమెంట్‌ హాల్లో జులై4న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను కలిశారు ఎంపీలు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ప్రవర్తన కూడా సరిగా లేదని… వాడుతున్న భాష, పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరును స్పీకర్‌ దృష్టికి తీసుకొచ్చారు ఎంపీలు. పార్టీ అధ్యక్షుడినే అవమానపరిచేలా ప్రవర్తించిన ఆయనపై వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని కోరారు. గతంలో కోర్టులు తీర్పులున్నాయి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. ఆర్టికల్‌ 102( 2) ప్రకారం చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు స్పీకర్‌ ఓం బిర్లా. ——————–IMAGE FULL PAGE

ఇంతకీ విజయసాయిరెడ్డి చెబుతున్న చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చా? లేదా? అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102(2) ప్రకారం పార్టీ ఫిరాయించినా లేదా విప్‌ దిక్కరించి పార్లమెంటుకు గైర్హాజరు అయినా అనర్హత వేటు పడుతుంది. ఆ పార్టీ ఫిర్యాదును స్పీకర్‌ పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆశా లేకుండా పోయింది. పార్టీలు మారినా… వేటు పడని వాళ్లు చాలామంది మనకళ్లముందున్నారు. మంత్రులు కూడా అయ్యారు. ఇది శాసనవ్యవస్థకు సంబంధించిన అంశం. స్పీకర్‌ విచక్షణకు లోబడి ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా అధికార పార్టీ ప్రయోజనాలు ఇందులో ముడిపడి ఉంటాయి. వారు తీసుకునే నిర్ణయాలే అంతిమంగా మారాయి. అలాంటిది విజయసాయిరెడ్డి చెబుతున్న మారో లాజిక్‌ దీనికి అప్లై అవుతుందా అన్నదే అంతుచిక్కని మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాజకీయ పార్టీ సభ్యత్వం తాను సొంతంగా ఇచ్చుకుంటే అప్పుడు అనర్హత ప్రకటిస్తారు. ఇది 10 షెడ్యూల్‌ లోని 2వ పారాగ్రాఫ్‌లో (ఏ)లో ఉంది. ఇది రాజకీయ పండితులకు కూడా అర్ధంకాని లెక్క. ఎవరూ పార్టీనుంచి ఎన్నికైన నాయకులు సొంతంగా పదవి నుంచి తప్పుకోరు. అయితే అధికారపార్టీ అవసరం అనుకుంటే దీనిని ప్రయోగిస్తుంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవానికి ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుంటుంది. గతంలో శరద్‌ పవార్‌, అన్వర్‌ విషయంలో ఇదే జరిగింది. JD(U)కు వ్యతిరేకంగా ఫ్రంట్‌లో పాల్గొన్నారు. దీంతో వారిపై వేటేశారు. ఇప్పుడు YSR కాంగ్రెస్ కూడా దీనిపైనే ఆశలు పెట్టుకుంది.

పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన రఘురామరాజు కూడా పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు కాబట్టి.. ఆయనపై వేటు వేయాలని భావిస్తోంది. చట్టంలో వెసులుబాటు ఉంది.. కానీ కేంద్రం రఘురామరాజు విషయంలో అలా చేస్తుందా? ఆయన్ను వాడుకుని ఎదగాలని చూస్తున్న పార్టీ కమలం. పైగా మోదీతో నేరుగా మాట్లాడే రాజుగారి విషయంలో వైసీపీ ఒత్తిడికి తలోగ్గుతుందా? అన్నదే ప్రశ్న. రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్న తీరుపై మొదట్లో లైట్గా తీసుకున్న పార్టీ… తర్వాత సీరియస్‌ అయింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇంగ్లీష్ మీడియా, ఇసుక విధానం, తిరుమల భూములు సహా పలు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై షోకాజ్‌ నోటీస్‌ ఇస్తే.. చెల్లదంటూ రివర్స్‌ లెటర్‌ రాశారు. అంతేకాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పదవిపైనా, పార్టీ పేరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ… రివర్స్‌ ఆరోపణలు చేశారు. ఏకంగా CM జగన్‌ కే లేఖ రాసి అందులో మరోసారి వివాదాస్పద అంశాలు లేవనెత్తారు. దీంతో పార్టీ రఘురామరాజు వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకుంది. నైతిక విలువలు లేకుండా విపక్షాలతో లూలూచీ పడ్డారన్నారు విజయసాయిరెడ్డి. అయితే అటు తనపై ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకుండా చూడాలని ముందే కోర్టును ఆశ్రయించారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. మరి అటు స్పీకర్‌ ఎలా స్పందిస్తారు.. ఇటు కోర్టులు ఏమంటున్నాయన్నది ఆసక్తిగా మారింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో