Pawan Kalyan: సర్దు ‘పోట్లు’.. జనసేనాని వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటి.? ఏపీలో హాట్ టాపిక్.!

|

Mar 14, 2024 | 7:13 PM

ఏపీలో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. అలకలు.. అసంతృప్తులు, ఆగ్రహజ్వాలలు, రహస్యమంతనాలతో రాజకీయం హీటెక్కుతోంది. టికెట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ-జనసేన నేతలు కొందరు, అవకాశం దక్కకపోవడంతో భగ్గుమంటున్నారు.

Pawan Kalyan: సర్దు పోట్లు.. జనసేనాని వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటి.? ఏపీలో హాట్ టాపిక్.!
Big News Big Debate
Follow us on

ఏపీలో అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. అలకలు.. అసంతృప్తులు, ఆగ్రహజ్వాలలు, రహస్యమంతనాలతో రాజకీయం హీటెక్కుతోంది. టికెట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ-జనసేన నేతలు కొందరు, అవకాశం దక్కకపోవడంతో భగ్గుమంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులకు కొందరు తలొగ్గినా.. ఇంకొందరు రాజీనామాలతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టికెట్ల వ్యవహారం ఇలా ఉంటే.. పొత్తులతో నష్టపోయింది జనసేన పార్టీయే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

పిఠాపురంలో పోటీపై క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌. మంగళగిరిలో పవన్‌ ప్రకటన చేసిన కొద్దిసేపటికే పిఠాపురంలో అగ్గి రాజుకుంది. టీడీపీ నుంచి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ అనుచరులు భగ్గుమన్నారు. ఇక్కడే కాదు, అటు తిరుపతిలో ఆరణి శ్రీనివాస్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ జనసేన-టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఇక పెనమలూరు టికెట్‌ ఇవ్వలేమంటూ అధిష్టానం చెప్పడంతో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అటు చీపురుపల్లి ఆఫర్‌ చేసిన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేడర్‌తో రహస్యంగా సమావేశమయ్యారు మాజీ మంత్రి గంటా. అటు జనసేనలో టికెట్ల వ్యవహారంలోనూ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరపున మీడియాలో బలంగా వాయిస్‌ వినిపిస్తున్న ప్రధానకార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ కలకలం రేపింది.

టికెట్ల పంచాయితీ అలా ఉంటే.. పొత్తులకు మధ్యవర్తిత్వం వహించి నష్టపోయామంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. పెద్దమనసుతో ముందుకెళితే చిన్నబోయామని చివరకు నాగబాబు సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చిందని చెప్పారు పవన్‌.
మొత్తానికి పొత్తుల వ్యవహారంలో పార్టీలు జాగ్రత్తగా డీల్‌ చేసినా… అభ్యర్ధుల ఎంపిక మాత్రం కత్తిమీదసాముగా మారింది. సీట్లు సర్దుబాటు పార్టీలకు తలపోటుగా మారుతోంది. మరి ఈ గండం నుంచి ఎలా బయటపడతాయో చూడాలి.