Watch Video: రుషికొండలో భీమిలి ఎమ్మెల్యే పర్యటన.. ప్రభుత్వం నిర్మించిన భవనాల పరిశీలన

విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను పరిశీలించారు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు. కూటమి నేతలంతా కలిసి రుషికొండకు వెళ్లి.. భవనాల లోపలంతా తిరిగి వాటిని చూసొచ్చారు. రుషికొండలో గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను చేపట్టింది. విశాఖ నుంచి పాలన కొనసాగింపుకు వీలుగా అక్కడ భవనాలను తీర్చిదిద్దినట్టు ప్రచారం జరిగింది. చాలా సార్లు సచివాలయం సహా, సీఎంవో ఆఫీసును అక్కడకు తరలిస్తారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. చాలా సార్లు ముహూర్తాలు పెట్టి మరీ పరిపాలనను తరలించడంలో వెనకడుగు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.

Watch Video: రుషికొండలో భీమిలి ఎమ్మెల్యే పర్యటన.. ప్రభుత్వం నిర్మించిన భవనాల పరిశీలన
Rishikonda Buildings
Follow us

|

Updated on: Jun 16, 2024 | 1:26 PM

విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను పరిశీలించారు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు. కూటమి నేతలంతా కలిసి రుషికొండకు వెళ్లి.. భవనాల లోపలంతా తిరిగి వాటిని చూసొచ్చారు. రుషికొండలో గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలను చేపట్టింది. విశాఖ నుంచి పాలన కొనసాగింపుకు వీలుగా అక్కడ భవనాలను తీర్చిదిద్దినట్టు ప్రచారం జరిగింది. చాలా సార్లు సచివాలయం సహా, సీఎంవో ఆఫీసును అక్కడకు తరలిస్తారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. చాలా సార్లు ముహూర్తాలు పెట్టి మరీ పరిపాలనను తరలించడంలో వెనకడుగు వేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. పైగా రాజధాని తరలింపు అంశంపై ఏపీ హై కోర్టులో పలు పిటిషన్లు దాఖలై వాటిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారం మారింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది.

ఈ తరుణంలో భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఆ నిర్మాణాలను పరిశీలించారు. జూన్ 4న ఫలితాలు వెలువడగానే కూటమి ఘనవిజయం సాధించడంతో ఆ భవనాలపై తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు గంటా శ్రీనివాస రావుతో పాటు కూటమి నాయకులు సడన్‌గా వీటిని చూసేందుకు రావడం వెనుక కారణం ఏంటి.. అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం వీటిని ఏం చేస్తుంది..? ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా.. లేదంటే గతంలో మాదిరిగా టూరిజం కోసం కేటాయిస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే రాష్ట్రపతి విడతి కోసం ఈ భవనాలను కేటాయించాలన్న ప్రతిపాదనకూడా తెరపైకి వచ్చింది. ఇంతకు ఈ భవనాలను ఏం చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…