Andhra News: జస్ట్ రూ 9999 కే ఐఫోన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

ఇన్‌స్టాలో రీల్స్ స్క్రోల్‌ చేస్తూ ఆఫర్ చూశాడు.. జస్ట్ రూ.9,999లకే ఐఫోన్‌ 16 ప్రో వస్తుందంటే ఆశ పడ్డాడు. వెంటనే దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు.. అందుకోసం డబ్బులు కూడా చెల్లించాడు. కానీ సీన్‌కట్‌ చేస్తే చాలా సేపటికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది ఆఫర్ కాదు సైబర్ నేరగాళ్లు వేసిన వలా అని అర్థమైంది.

Andhra News: జస్ట్ రూ 9999 కే ఐఫోన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!
Fake Iphone Offer

Updated on: May 23, 2026 | 9:24 AM

సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటన చూసి.. అది నిజమేనని మోసోతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. రూ.9,999 ఐఫోన్‌ 16 ప్రో వస్తుందంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ ప్రకటన చూసిన యువకుడు.. దాన్ని కొనాలి అనుకున్నాడు. వెంటనే లింక్‌పై క్లిక్ చేశాడు.. అప్పుడు అతనికి రిజిస్టర్ చేసుకోవాలి ఒక ఫేజ్ ఓపెన్ అయింది. దీంతో రూ.2500 చెల్లించి అతను రిజిస్టర్ అయ్యాడు. డబ్బులు రాలేదు అంటే మరోసారి రూ.2500 చెల్లించి రిజిస్టర్ అయ్యాడు.

అయితే కాసేపటి తర్వాత అతనికి ఒక ఫోన్‌ కాల్ వచ్చింది. ఫోన్‌ తీసుకొని వస్తుంటే పోలీసులు పట్టుకున్నారని.. వాళ్లను రూ.5వేలకు సెట్‌ చేశానని.. ఆ డబ్బులు ఇస్తే వాళ్లు వదిలేస్తారని చెప్పాడు. లేదంటే మీరు రూ.10వేలకే పొందాల్సిన ఐఫోన్ కోల్పోతారని కంగారు పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసలును సంప్రదించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అది ఆఫర్ కాదని.. సైబర్ నేరగాడు పన్ని పన్నాగమని పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి సూచించారు.

ఇన్‌స్టాలో వచ్చే ఆఫర్‌లు చూసి జనాలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తన్నారు. యాడ్స్‌ ద్వారా ఆఫర్స్‌ అని ఆశపెడతారు.. తర్వాత టైం లిమిట్‌ పెట్టి కంగారు పెడతారు.. లిమిటెడ్‌ మెంబర్స్‌కే ఆఫర్ అని.. త్వరగా గ్రాబ్ చేసుకోకపోతే ఆఫర్‌ను కోల్పోతారని హడావుడి చేస్తారు. క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు వసూలు చేస్తారు.. తీరా డబ్బులు పంపాకే అసలు ట్విస్ట్ ఇస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇన్‌స్టాలో వచ్చే యాడ్స్‌ను ఏ మాత్రం నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. నేరుగా స్టోర్ సందర్శించి, లేదా అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే వస్తులువు కొనాలని సూచిస్తున్నారు. ఆఫర్లు చూసి మోసపోవద్దని.. ఖరీదైన ఫోన్‌లు ఎవరూ తక్కువ ధరలు అమ్మరని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us