Cute Baby Cow : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న అరుదైన పుంగనూరు జాతి ఆవు దూడ..

|

Feb 17, 2021 | 10:47 AM

గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది అది ఒక అందమైన చూడచక్కని చిన్న లేగదూడ.. ఆ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు...

Cute Baby Cow : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న అరుదైన పుంగనూరు జాతి ఆవు దూడ..
Follow us on

Cute Baby Cow : గత మూడు రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది అది ఒక అందమైన చూడచక్కని చిన్న లేగదూడ.. ఆ దూడను ముచ్చటగా అలంకరించారు దాని యజమాని. అందమైన గంటలు కట్టడంతో.. అది కదులుతుంటే గంటలు మ్రోగుతూ సందడి చేస్తోంది. అయితే ఇది ఒక ప్రత్యేకమైన జాతి ఆవు అని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు లో ఈ జాతి ఆవులుంటాయి. ఈ ఆవులు మహా అయితే 3, 4 అడుగుల ఎత్తువరకూ మాత్రమే పెరుగుతాయి. ఇక బరువు కూడా 150 నుంచి 200 కేజీలు ఉంటాయని తెలుస్తోంది. అయితే పాలు మాత్రం రోజు 4 నుంచి 5 లీటర్ల వరకూ ఇస్తాయని.. అవి చాలా చిక్కగా ఉంటాయి. ఈ వీడియో ను షేర్ రాజీవ్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా దారుగా పనిచేస్తున్నారు.

ఐతే ఇప్పటి వరకూ సర్వ సాధారణంగా పిల్లులు, కుక్కలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఈ ఆవు వీడియో ప్రత్యేకం అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read:

Rare Owl Video : జనగామ జిల్లా కేంద్రంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.

Simple Ways to Improve Your Credit Score Video: మీ క్రెడిట్‌ స్కోర్‌ని ఇలా పెంచండి!