వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు

భక్తులు, పర్యాటకులకు ఏపీటీడీసీ శుభవార్త అందించింది. విజయవాడ నుంచి వాడపల్లి వరకు ఒకరోజు తీర్థయాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, భోజన వసతులతో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఏపీటీడీసీ బంపర్ ఆఫర్.. ఇదిగో పూర్తి వివరాలు
Aptdc Vadapalli Tour Package

Edited By:

Updated on: Aug 05, 2026 | 1:42 PM

వాడపల్లి వెంటకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలి అనుకునే భక్తులకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల ఆగస్టు 8వ తేదీ విజయవాడ టూ వాడపల్లి మధ్య ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకెజీని స్టార్ట్ చేయనున్నట్టు తెలిపింది. విజయవాడ సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 4 గంటలకు బయలుదేరే బస్సు.. అదే రోజు సాయంత్రం 7 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటుంది. ఈ వన్‌డే టూర్ ప్యాకేజీలో పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1,000గా ధర నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా సౌకర్యవంతమైన బస్సు ప్రయాణంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నారు.

అయితే ఆలయ దర్శనం టికెట్ ఛార్జీలు మాత్రం యాత్రికులే చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ముందస్తుగా తమ సీట్లను బుక్ చేసుకోవాలని ఏపీటీడీసీ అధికారులు సూచించారు..www.aptdc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా విజయవాడ బందర్ రోడ్‌లోని లెమన్ ట్రీ హోటల్ సమీపంలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్‌లో నేరుగా సంప్రదించి రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు సమయం, ప్రయాణ ఇబ్బందులను తగ్గించేలా ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ టి.ఎస్.వి. నారాయణ తెలిపారు. విజయవాడ నుంచి వాడపల్లి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఈ ప్రత్యేక ప్యాకేజీ మంచి అవకాశం కానుంది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us