Andhra Pradesh: నిద్రపోవటానికి తెర తీశారు.. వాళ్ల ఆలోచనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. చాలా పెద్ద కథే ఇది..

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖ మెరుగదు అంటారు.. అయితే, ప్రతి రోజూ అలానే ఆద మరిచి నిద్ర పోవాలంటే అందరికి సాధ్యం కాదు. దొరికిన కాస్తంత సమయంలోనే సుఖంగా నిద్రపోయి తర్వాత రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఆ సుద్ర కోసం ఆర్టీసీ డ్రైవర్లు ఆపసోపాలు పడుతున్నారు.

Andhra Pradesh: నిద్రపోవటానికి తెర తీశారు.. వాళ్ల ఆలోచనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. చాలా పెద్ద కథే ఇది..
Apsrtc Employees
Follow us
T Nagaraju

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 19, 2024 | 4:56 PM

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖ మెరుగదు అంటారు.. అయితే, ప్రతి రోజూ అలానే ఆద మరిచి నిద్ర పోవాలంటే అందరికి సాధ్యం కాదు. దొరికిన కాస్తంత సమయంలోనే సుఖంగా నిద్రపోయి తర్వాత రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఆ సుద్ర కోసం ఆర్టీసీ డ్రైవర్లు ఆపసోపాలు పడుతున్నారు. గుంటూరు నగరంలో డిపోలకు చాలా బస్సులు నైట్ హాల్ట్ కోసం చేరుకుంటాయి. తెల్లావారు జాము నుంచే ఆయా ప్రాంతాలకు తిరిగి వెలుతుంటాయి. అయితే నైట్ హాల్ట్ షిఫ్ట్ లల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఉన్న వసతి సౌకర్యంగా లేకపోవడంతో డ్రైవర్లు రాత్రి పూట పడుకునేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఆర్టిసీ బస్సులతో పాటు హైర్ బస్సులు కూడా వివిధ మార్గాల్లో ఎక్కువుగా తిరుగుతున్నాయి. దీంతో ఈ డ్రైవర్లంతా ప్రతి రోజూ లాడ్జి రూంల్లో విశ్రాంతి తీసుకునేంత ఆర్థిక వెసులు బాటు ఉండదు. దీంతో వీరు ఆ బస్సుల్లోనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. డిపోల్లో పార్క్ చేసిన బస్సులపైకి ఎక్కి అక్కడే నిద్ర పోతుంటారు. అయితే ఈ సీజన్‌లో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. డిపో పెద్దగా ఉన్న చుట్టూ ఉన్న కమర్షియల్ భవనాలు, మార్కెట్ కారణంగా దోమల బెడద కూడా ఎక్కువే.. దీంతో రాత్రి పది గంటల తర్వాత బస్సు ఎక్కి నిద్ర పోదామనుకున్నా నిద్ర పట్టని పరిస్థితి డ్రైవర్లకు ఎదురైంది. దీంతో ఒక మంచి ఆలోచన చేశారు.

బస్సు పైనే దోమ తెరలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే అంత ఎత్తుల్లో ఎలా వాటిని ఏర్పాటు చేసుకుంటున్నారనేగా మీ డౌట్. అయితే ఈ మధ్య కాలంలో గూడులా ఉండే దోమ తెరలు వచ్చాయి. ఈ దోమ తెరల్లోకి వెళ్లేందుకు చిన్న మార్గం ఉంటుంది. లోపలికి వెళ్లిన తర్వాత ఆ మార్గాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇక, దోమలు లోపలకి వచ్చే పరిస్థితే ఉండదు. తెల్లవారిన తర్వాత ఆ గూడులాంటి దోమ తెరను మడత పెట్టి బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇది సులభంగా ఉండటంతో డ్రైవర్లు ఎక్కువ మంది వీటినే ఉపయోగిస్తున్నారు.

Apsrtc Employees

Apsrtc Employees

అయితే, డ్రైవర్లు ఆలోచన చాలామందికి బాగా నచ్చింది. అటుగా వెలుతున్న వారు ఫోటోలు తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల ఆలోచనకు శభాష్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..