APPSC Group 4 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్స్‌ పరీక్ష తేదీ ప్రకటన.. హాల్‌టికెట్లు ఎప్పట్నుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌-గ్రూప్‌ 4 పోస్టులకు సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా కేంద్రాల్లో..

APPSC Group 4 Exam Date: ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్స్‌ పరీక్ష తేదీ ప్రకటన.. హాల్‌టికెట్లు ఎప్పట్నుంచంటే..
APPSC Group 4 Exam

Updated on: Mar 24, 2023 | 9:47 PM

ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌-గ్రూప్‌ 4 పోస్టులకు సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో మెయిన్స్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించి మార్చి 27 నుంచి కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరయ్యారు. వీరిలో మెయిన్స్‌ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ వచ్చేనెల 4వ తేదీన మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us