AP Weather: ఏపీలో మరో 2 రోజులు దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు

ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి.

AP Weather: ఏపీలో మరో 2 రోజులు దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు
Andhra Weather Report

Updated on: Mar 17, 2023 | 2:27 PM

సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు గాలికోత గా అంతర్గత తమిళనాడు నుండి మధ్య ప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా కొనసాగుతున్నది. ఉపరితల ఆవర్తనం నుండి బంగ్లాదేశ్ & పొరుగుప్రాంతాల పై నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేస్ వరకు గంగా నది పశ్చిమ బెంగాల్ & ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి ఇపుడు బలహీనపడినది.

శుక్రవారం:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది

శనివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30 -40 కి మీ వేగంతో)వీచే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us