Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలో పిగుడలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పస్టం చేసింది. కాబట్టి శనివారం ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం.

Weather Update: మండే ఎండల్లో చల్లని కబురు.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎప్పటివరకంటే?
Ap Weather Forecast

Updated on: May 01, 2026 | 8:30 PM

రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే విజయనగరం 8, మన్యం 10, పోలవరం 2, ఎన్టీఆర్ 1, గుంటూరు 1, పల్నాడు 19, మార్కాపురం 6, ప్రకాశం 10, నెల్లూరు 3, తిరుపతి 4 మొత్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం రాష్ట్రంలో రికార్డ్‌ స్థాయి ఉష్ణోగ్రతలు

ఇదిలా ఉండగా రాష్ట్రంలో శుక్రవారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 252 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాశ్ జైన్ వెల్లడించారు.

మరోవైపు దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుందని ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి ,పోలవరం, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండతీవ్రత స్వల్పంగా తగ్గి మేఘావృత వాతావరణం, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. అలాగే ఎండల పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బయటకు వెళ్లేప్పుడు గొడులు, గాలిఆడే దుస్తువులను ధరించాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us