
రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ సరికొత్త సంర్కరణలు తీసుకొస్తుంది. అందులో భాగంగానే గతేడాది పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఈ స్మార్ట్ కార్డు ద్వారానే లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందిస్తోంది. అయితే ప్రభుత్వం అమలు చేసే పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు రేషన్ కార్డులను ప్రమాణికంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఈకేవైసీ లేని వారిని అనర్హులను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
రేషన్ కార్డుల ఈకేవైసీపీ ప్రభుత్వం గతేడాది ప్రారంభించినా ఇప్పటి వరకు చాలా మంది పూర్తి చేసుకోలేదని.. వారందరూ త్వరిత గతినా రేషన్ కార్డు ఈకేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. లేని పక్షంలో ప్రభుత్వ పథకాలు ఆగిపోయే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ సరుకులను తీసుకోవాలని, ఎవరైతే తీసుకోరో వారికి కూడా రేషన్ సరఫరా ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రేషన్ కార్డులకు సంబంధించి పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తున్నారు.
మీరు ఈకేవైసీని ఇలా చేసుకోండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.