92 Year old Grand Mother Nomination: ఏపీలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. ఇక తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యురాలు పదవి కోసం 92 ఏళ్ల బామ్మ గురువారం నామినేషన్ వేసింది. గ్రామానికి చెందిన గ్రంధి లక్ష్మీ నరసమ్మ తన నామినేషన్‌ను స్టేజ్ -1 అధికారికి అందజేశారు. ఇంత వయసు ఉన్న బామ్మ వార్డు సభ్యురాలిగా నామినేషన్ వేయడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
బామ్మను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. కాగా, రాష్ట్రంలో తొలి విడతలో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రెండో దశ నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అటు ఎన్నికల కమిషన్‌కు ఇటు ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
Also Read: AP Panchayat Elections: సర్పంచ్‌ల ఏకగ్రీవాలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్