AP Panchayat Election Results 2021: ఎన్నో రాజకీయ పరిమాణాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ఎట్టకేలకు పూర్తయింది. చెదురుమదురు సంఘటనలు మినహాయించి ఎన్నికల ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 3.30 వరకు క్యూ లైన్‌లో నిలుచున్న వారికి ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
సుమారు 80 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమవ్వగా.. రాత్రి లోపు ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తం 12 జిల్లాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్‌లో భాగంగా మొదట వార్డు మొంబర్‌ల ఓట్లను లెక్కించనుండగా, అనంతరం సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం 7 గంటల వరకు 80 నుంచి 90 శాతం ఫలితాలు తెలియనున్నాయి.