CBN Cabinet: మంత్రవర్గ కూర్పులో చంద్రబాబు చాణక్యం.. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యేలకు ఫుల్‌ ప్రియారిటీ..!

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను అధికారికంగా విడుదల చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను అప్పగించారు.

CBN Cabinet: మంత్రవర్గ కూర్పులో చంద్రబాబు చాణక్యం.. ఫస్ట్‌ టైమ్‌ ఎమ్మెల్యేలకు ఫుల్‌ ప్రియారిటీ..!
Ap Cm Chandrababu

Updated on: Jun 14, 2024 | 4:50 PM

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను అధికారికంగా విడుదల చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్‌కు విద్య (హెచ్‌ఆర్‌డీ), ఐటీ, ఆర్టీజీ శాఖలు, కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖను అప్పగించారు.

రాజకీయ చాణుక్యుడిగా పేరొందిన చంద్రబాబు… తన మంత్రివర్గ కూర్పులోనూ అదే చాణక్యం ప్రదర్శించారు. ఇటీవల ముఖ్య నేతల సమావేశంలో ఇకమీదట మారిన చంద్రబాబును చూస్తారన్న బాబు.. మాట వరసకు అనలేదని నిరూపించారు. మంత్రవర్గ కూర్పుతోనే ఏపీలో పక్షాళన మొదలు పెట్టినట్లు కనిపిస్తున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నవారు చాలా మంది ఉన్నారు. బాబు కేబినెట్‌లో 12మంది కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. ఒకసారి లిస్ట్ పరిశీలిద్దాం…

1. పవన్‌ కల్యాణ్‌- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

2. వంగలపూడి అనిత- హోంశాఖ

3. సత్యకుమార్‌- వైద్య, ఆరోగ్యశాఖ

4. నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ

5. పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ

6. అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ

7. బాల వీరాంజనేయ స్వామి-సాంఘిక సంక్షేమ శాఖ

8. గొట్టిపాటి రవికుమార్‌-విద్యుత్ శాఖ

9. సంధ్యారాణి-మహిళా, గిరిజన సంక్షేమ శాఖ

10. జనార్ధన్‌రెడ్డి-రోడ్లు, భవనాల శాఖ

11. టీజీ భరత్‌-పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్

12. సవిత-బీసీ వెల్ఫేర్‌, చేనేత

సీనియారిటీ సీనియారిటీనే… బట్‌ ప్రయారిటీ కూడా చాలా ఇంపార్టెంట్‌. ఆ శాఖల పట్ల వారు ఎంత ఉత్సాహంగా ఉన్నారన్నదీ మరీ ముఖ్యం. అందుకే కొత్తవారైనా సరే, అలాంటి వారినే కీలక శాఖలకు ఎంపిక చేశారు చంద్రబాబు. చంద్రబాబు టీమ్‌లో సగానికి పైగా కొత్తవారే ఉన్నారంటే, ఆయన ప్రయారిటీస్‌ ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ కీలక శాఖలన్నీ కొత్తవారికే దక్కడం మరో విశేషం. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌ కల్యాణ్‌కు కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు సైన్స్ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన బాధ్యతలను కూడా కట్టబెట్టారు చంద్రబాబు. దీనికి కారణం లేకపోలేదు. ఆ జోనల్‌లో పవన్‌కు ఉన్న ఇంట్రస్ట్‌ కూడా అలాంటిదని చెప్పొచ్చు.

వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ దక్కడం విశేషం. గత ప్రభుత్వంతో అనిత చేసిన పోరాటానికి తగిన గుర్తింపు అని కూడా అంటున్నారు టీడీపీ నేతలు. ఇక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. అయితే, ఆయనకు కీలకమైన జలవనరుల శాఖ దక్కడం విశేషం. రామానాయుడి ఎంపికలోనూ చంద్రబాబు చాణక్యం చూపించారనుకోవచ్చు. స్వయానా రైతుగా, సాగునీటి విషయంలో రైతుల పక్షాన పోరాడిన రామానాయుడికి ఆ రంగంలో కాస్త పట్టుంది. అందుకే ఈ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.

సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కు కూడా అమాత్య యోగం తొలిసారే. అయితే, పీఏసీ చైర్మన్‌గా ఆర్థిక లావాదేవీలపై మంచి పట్టుండటం, దానికి సంబంధించి అనర్గళంగా మాట్లాడే నాలెడ్జ్‌ ఉండటం పయ్యావులకు కలిసొచ్చింది. అందుకే, ఆయనకు కీలకమైన ఆర్థికశాఖను ఇచ్చారు చంద్రబాబు. అనగాని సత్యప్రసాద్‌కు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు చంద్రబాబు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద గట్టిగా పోరాటం చేశారు అనగాని. అంతేకాదు, భూముల రికార్డుల విషయంలో ఆయనకు మంచి పట్టే ఉంది. అందుకే సత్యప్రసాద్‌ను రెవెన్యూ మంత్రిగా ఎంపిక చేసుకున్నారు చంద్రబాబు.

ఫస్ట్‌ టైమ్‌ మంత్రిపదవి దక్కిన వారిలో బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, గొట్టిపాటి రవికుమార్‌ కు విద్యుత్ శాఖ, సంధ్యారాణికి మహిళా, గిరిజన సంక్షేమ శాఖ.. బీసీ జనార్ధన్‌రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ.. సవితకు బీసీ వెల్ఫేర్‌, చేనేత శాఖలను అప్పగించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇక టీవీ వెంకటేశ్‌ వారసుడిగా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన టీజీ భరత్‌కు.. వైశ్య కోటాలో టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖను కేటాయించారు చంద్రబాబు. ఇండస్ట్రియలిస్ట్‌గా భరత్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా.. బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..