Minister RK Roja: ప్రమాణస్వీకారం వేళ రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..

|

Apr 11, 2022 | 2:16 PM

'ఆర్కే రోజా అనే నేను..' ఇలా మంత్రిగా ప్రమాణం చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూశారు. ఇంతకాలానికి జగన్ 2.0లో కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు. పదవి ఆశించి నిరాశకు గురైనవారు అలకబూనారు..

Minister RK Roja: ప్రమాణస్వీకారం వేళ రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..
Roja Becomes Minister After
Follow us on

‘ఆర్కే రోజా అనే నేను..’ ఇలా మంత్రిగా ప్రమాణం చేయాలని ఎంతో కాలంగా ఎదురు చూశారు. ఇంతకాలానికి జగన్ 2.0లో కేబినెట్ మంత్రి పదవి దక్కించుకున్నారు. పదవి ఆశించి నిరాశకు గురైనవారు అలకబూనారు.. అయితే, మంత్రి పదవి దక్కినవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రోజా. తొలిసారి మంత్రివర్గంలో అడుగుపెట్టిన ఫైర్‌ బ్రాండ్‌ ఆర్కే రోజా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పత్రాలపై సంతకం పెట్టిన అనంతరం ఆ అధికారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన రోజు ఆయన పాదాలకు వందనం చేశారు. రోజాకు సీఎం జగన్ ఆశీర్వదించారు. అనంతరం కృతజ్ఞతతో ఆయన చేతిని ముద్దాడారు సీఎం రోజా. అనంతరం గవర్నర్‌కు నమస్కరించారు.

కుటుంబ నేపథ్యం..

రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. 16-11 -1972న జన్మించారు. తండ్రి కుమారస్వామి రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోజా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ నుంచి డిగ్రీ అందుకున్నారు. కొన్ని సంవత్సరాలు కూచిపూడి నృత్యాన్ని నేర్చుకున్నారు. బిఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ప్రేమ తపస్సు చిత్రం ద్వారా సినిమాలకు పరిచయమయ్యారు రోజా. దానికంటే ముందు తమిళచిత్రం చంబరతి చిత్రంలో నటించారు.

ఆ సినిమా తమిళంలో మ్యుజికల్ హిట్. తెలుగులో చేమంతి కింద డబ్ చేశారు. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణి రూపొందించాడు. ఆయనతోనే ప్రేమలో పడిపోయిన రోజా పెద్దల అంగీకారంతో దంపతులయ్యారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కొడుకు కృష్ణ కౌశిక్ ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం ఇలా..
2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి పై పోటీ చేశారు. 2009లో చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేక పోయారు. డాక్టర్ YSR  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిన రోజా.. ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు.  2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు పై విజయం సాధించిన రోజా.. 2019 ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ పై  గెలిచి సత్తా చాటారు.

ఇవి కూడా చదవండి: Jagan Cabinet 2.0: ఒక్కప్పుడు ఆ పార్టీలో.. ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలోకి.. కల్యాణదుర్గం ఎమ్మెల్యే..

Jagan Cabinet 2.0: మాటల మాంత్రికుడికి గుర్తింపు.. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అంబటి..