
AP Municipal Election 2026 Result:ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కౌటింగ్ ప్రారంభమైంది. రీపోలింగ్ సెంటర్లతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పురపోరుకు సంబంధించిన ఫలితాలు మరికొన్ని నిమిషాల్లో విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని.. అటు అధికార కూటమి, ఇటు విపక్షం.. తమ నేతలను, శ్రేణులను అలెర్ట్ చేశాయి.
ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు అధికారులు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ లోపల, బయట సీసీ కెమెరాలు ఉంటాయి. పాస్‌లు ఉన్న ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ హాల్‌లోపలికి అనుమతి ఉంటుంది.
మొత్తం 92 పురపాలికల్లో పోలింగ్ జరగగా… ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో 556 కౌంటింగ్ హాల్స్.. 6 వేల 831 కౌంటింగ్ టేబుల్స్‌ను సిద్ధం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు 6 వేల 831 మంది సూపర్వైజర్లు ఉంటారు. కౌంటింగ్ కోసం 13వేల 662 మంది సిబ్బంది ఉంటారు. ఓట్ల లెక్కింపులో 27 వేల 324 మంది అసిస్టెంట్లు పాల్గొంటారు.
ఇక 13 కార్పొరేషన్లలోని 922 డివిజన్లలో 118 ఏకగ్రీవం కాగా.. మున్సిపాలిటీల్లోని 3,020 వార్డులకు గానూ 637 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,382 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం స్థానాలకు 10వేల 262 మంది పోటీ చేశారు. వీరి భవితవ్యం కాసేపట్లో తేలనుంది.
రీ పోలింగ్ తర్వాత చూస్తే.. ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 62.16 శాతం పోలింగ్ నమోదైనట్టు SEC ప్రకటించింది. 96 లక్షల 89వేల 61 మంది ఓటర్లకు గాను 60లక్షల 22వేల 411 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం చూస్తే… పెద్ద నగరాల కంటే చిన్న మున్సిపాలిటీల్లోనే అధికంగా పోలింగ్ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
రీపోలింగ్ ప్రకటించిన 13 కేంద్రాల్లోనూ ఆ ప్రక్రియ పూర్తయిపోవడంతో… వాటిలో కూడా కౌంటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అధికారులు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిల్లో కలిపి మొత్తం 2,805 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు… స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు అమర్చారు.
లైవ్ అప్డైట్స్ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నంద్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో రీ కౌంటింగ్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 6వ వార్డు వైసీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన తర్వాత మళ్లీ రీ కౌంటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఎన్నికల అధికారిని నిలదీశారు. టీడీపీ నేతల డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ చేయడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు, శిల్పా రవి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు పంపించారు. టీడీపీ నేతల డిమాండ్ మేరకు 6, 20, 52 వార్డుల్లో రీ కౌంటింగ్ కొనసాగుతోంది.
విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 6, 7 వార్డుల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన తండ్రీకూతుళ్లు విజయం సాధించారు. 6వ వార్డు నుంచి పోతిన హనుమంతు, 7వ వార్డు నుంచి పోతిన జాహ్నవి కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీల విజయ పరంపర కొనసాగుతోంది. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం ఖాయం చేసుకున్నారు. ఇప్పటికే పలు కార్పొరేషన్లను గెలుచుకున్న కూటమి, తాజాగా మరో ఐదు మేయర్ పీఠాలను తన ఖాతాలో వేసుకుంది. మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అబిదా, నెల్లూరులో రూప్‌కుమార్ యాదవ్, ఏలూరులో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, కర్నూలులో టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూష విజయం సాధించారు. దీంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఏలేశ్వరం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి ఎన్నిక ఉత్కంఠగా మారింది. మొత్తం 28 వార్డులకు గాను 21 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, 7 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. భారీగా పోలైన ఓట్లు ఎన్నికలపై ఆసక్తిని పెంచాయి. అయితే వైసీపీ చైర్మన్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో చైర్మన్ ఎన్నిక హోరాహోరీగా మారింది. వార్డుల వారీగా వచ్చిన ఫలితాలు, చైర్మన్ ఎన్నికలో పడే ఓట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల ప్రత్యూష 26,652 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో కర్నూలు నగర రాజకీయాల్లో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రత్యూషకు ప్రజలు భారీ మద్దతు పలకడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కర్నూలు నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని ప్రత్యూష హామీ ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీలకు లభిస్తున్న విజయాలు ప్రభుత్వ పాలనపై ప్రజలు చూపిన విశ్వాసానికి నిదర్శనమని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపర్లైనా ప్రజలు కూటమికే మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనకు బలమైన మద్దతు ఇచ్చిన పట్టణ, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, గెలుపు కోసం కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు పాలన అనుభవంతో ఏపీని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు పునరావృతమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి 100 శాతం విజయం లభించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో వైఎస్ జగన్ ఈవీఎంలపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా తప్పుపడతారా అని ప్రశ్నించారు. ఎన్నికలను హైజాక్ చేశారంటూ ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు అందుకు సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. పులివెందులలో సైతం కూటమి విజయం సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను చూసైనా జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతగా జగన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై 44,661 భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
నేను ఊహించని మెజారిటీని ప్రజలు అందించారు: రెడ్డి అప్పలనాయుడు
విపక్ష సభ్యులు లేకపోయినా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాం: అప్పలనాయుడు
మేయర్‌గా అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు రుణపడి ఉంటా: రెడ్డి అప్పలనాయుడు
మున్సిపల్ చైర్మన్‌గా వైసీపీ అభ్యర్థి తంబి రెడ్డి రాజేశ్వరమ్మ ఘన విజయం.. 1,187 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థిపై గెలుపు.
ఓటమిని అంగీకరించకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి టీడీపీ నేతలు వాకౌట్!
తిరుపతి, చిత్తూరు, గుంటూరు కార్పొరేషన్లలో కూటమి పార్టీలకు మెజారిటీ డివిజన్లు!
కార్పొరేషన్ల వారీగా ఫలితాలు:
– తిరుపతి (66):
టీడీపీ – 38
జనసేన – 19
వైసీపీ – 3
బీజేపీ – 3
ఇతరులు – 3
చిత్తూరు (60):
టీడీపీ – 51
జనసేన – 3
వైసీపీ – 4
బీజేపీ – 1
ఇతరులు – 1
గుంటూరు (76):
టీడీపీ – 48
జనసేన – 13
వైసీపీ – 11
బీజేపీ – 3
ఇతరులు – 1
మూడు కార్పొరేషన్లలోనూ టీడీపీ అత్యధిక డివిజన్లలో విజయం!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి హవా!
వార్డుల వారీగా కూటమి పార్టీల ఆధిక్యం..
– టీడీపీ – 31 వార్డులు
– జనసేన – 14 వార్డులు
– బీజేపీ – 4 వార్డులు
– వైసీపీ – 2 వార్డులు
విజయవాడలో కూటమి ఖాతాలో 49 వార్డులు.. వైసీపీకి 2 స్థానాలు!
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ కైవసం!
మేయర్‌గా కోవెలమూడి లక్ష్మి అపర్ణ ఘన విజయం..
స్వచ్ఛ గుంటూరు.. హరిత గుంటూరు సాధనే నా లక్ష్యం: కోవెలమూడి లక్ష్మి అపర్ణ
అమరావతికి పోటీగా గుంటూరును అభివృద్ధి చేస్తాం.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను: లక్ష్మి అపర్ణ
ఈ విజయం గుంటూరు ప్రజలది.. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు: కోవెలమూడి లక్ష్మి అపర్ణ
నంధ్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో టీడీపీ కూటమి హవా!
36 వార్డుల్లో 18 స్థానాలతో కూటమి విజయం.. వైసీపీకి 15 వార్డులు!
చైర్పర్సన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఘన విజయం.. 375 ఓట్ల మెజారిటీ!
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. చైర్పర్సన్ అభ్యర్థి లెంక అప్పలనాయుడు 3,598 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 23 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఫలితాలు ఇలా ఉన్నాయి.
– టీడీపీ – 10 వార్డులు
– జనసేన – 5 వార్డులు
– స్వతంత్రులు – 6 వార్డులు
– వైసీపీ – 2 వార్డులు
వార్డుల వారీగా వచ్చిన ఫలితాలతో పాటు చైర్పర్సన్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం నెల్లిమర్ల రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును సేవ చేసే బాధ్యతగా స్వీకరిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత రెండున్నరేళ్ల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా ఈ విజయాన్ని భావిస్తున్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడికి సేవ చేయడమే తమ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. అహంకారానికి తావులేదని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన బాధ్యతని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు గతంలో కంటే మరింత కష్టపడి పనిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
అమలాపురం మున్సిపాలిటీలో జనసేన పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్ 11,979 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంతో అమలాపురం మున్సిపాలిటీలో జనసేన తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మేయర్ రేసులో జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ముందంజలో ఉన్నారు.
ఇప్పటివరకు పార్టీల వారీగా వార్డుల ఫలితాలు:
– టీడీపీ – 17 వార్డులు
– జనసేన – 6 వార్డులు
– బీజేపీ – 4 వార్డులు
– వైఎస్సార్సీపీ – 3 వార్డులు
విజయవాడ కార్పొరేషన్లో మొత్తం 86 వార్డులు ఉండగా, ఒక వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగిలిన 85 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 62 డివిజన్లకు గాను టీడీపీ, జనసేన అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు.
పార్టీల వారీగా గెలిచిన డివిజన్లు:
– టీడీపీ – 35
– జనసేన – 13
– స్వతంత్రులు – 8
– బీజేపీ – 3
– వైఎస్సార్సీపీ – 3
మరోవైపు మేయర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా, జనసేన అభ్యర్థి 17,344 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మిగిలిన మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మేయర్ అభ్యర్థుల తుది ఫలితంపై ఏలూరులో ఉత్కంఠ నెలకొంది.
చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత(టీడీపీ) విజయం
మచిలీపట్నం మేయర్‌గా అబ్దుల్ అబీదా(టీడీపీ) విజయం
తిరుపతిలో మేయర్‌గా JB శ్రీనివాస్(టీడీపీ) విజయం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వరుదు కల్యాణిపై ఏకంగా 1,19,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు లెక్కించిన 4,36,676 ఓట్లలో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి.
– టీడీపీ: 2,56,881 ఓట్లు
– వైసీపీ: 1,37,194 ఓట్లు
– కాంగ్రెస్: 5,434 ఓట్లు
– ఇతరులు: 37,163 ఓట్లు
టీడీపీ, వైసీపీ మధ్య భారీ ఓట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ముక్కా శ్రావణి ఆధిక్యంతో విశాఖ మేయర్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ మేయర్ అభ్యర్థి మన్యం శ్రీనివాస ప్రసాద్ (జేబీ శ్రీనివాస్) తన సమీప ప్రత్యర్థిపై 61,582 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయంతో తిరుపతి కార్పొరేషన్లో టీడీపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మేయర్‌గా మన్యం శ్రీనివాస ప్రసాద్ ఎన్నిక కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి ఐక్యతకు, కేంద్ర ప్రభుత్వ సహకారానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. పులివెందుల, పుంగనూరులో వైసీపీ చేసిన గొడవలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని పల్లా తెలిపారు. ప్రజలు కూటమిపై విశ్వాసం ఉంచి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసీపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రజాతీర్పును గౌరవించాలని, అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా ఆయన అభివర్ణించారు.
కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన కూటమి (టీడీపీ) అభ్యర్థి కన్నెకంటి అమూల్య 9 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి నల్లమోతు తేజస్విపై అమూల్య గెలుపొందారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు:
నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింతకాయల పద్మావతి(టీడీపీ)
యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రమా కుమారి (బీజేపీ)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 32 వార్డుల్లో 31 వార్డులను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మరో వార్డులో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్ 15,536 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కుప్పం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలుః
నిడదవోలు మున్సిపల్ చైర్మన్‌గా జ్యోతి(జనసేన)
నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా శైలజ(జనసేన)
నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా ఇళయరాజా(టీడీపీ)
కొవ్వూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి(టీడీపీ)
కాకినాడ మున్సిపల్ చైర్మన్‌గా తమ్మయ్య నాయుడు(జనసేన)
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలుః
ఆకివీడు మున్సిపల్ చైర్మన్‌గా షేక్ నిలోఫర్(టీడీపీ)
నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా శైలజ(జనసేన)
నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా ఇళయరాజా(టీడీపీ)
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
పెడన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జ్యోత్స్న(జనసేన)
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వినీత(టీడీపీ)
ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా ప్రవీణ్(టీడీపీ)
తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మాధవి(జనసేన)
నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా వంశీధర్(టీడీపీ)
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలుః
గుంతకల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా యశోద(టీడీపీ)
గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తమిళ్ సెల్వి(టీడీపీ)
తాడిపత్రి చైర్‌పర్సన్‌గా రేష్మ పర్వీన్(టీడీపీ)
రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా హనుమంతు(టీడీపీ)
కల్యాణదుర్గం చైర్‌పర్సన్‌గా బుట్న లక్ష్మి(టీడీపీ)
కదిరి మున్సిపల్ చైర్మన్‌గా అర్షియా భాను(టీడీపీ)
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌గా మేకల ఈశ్వర్(జనసేన)
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా మంజునాథ్(టీడీపీ)
మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్‌గా శారద(జనసేన)
పెనుకొండ చైర్మన్‌గా త్రివేంద్రమూర్తి(టీడీపీ)
ధర్మవరం మున్సిపల్ చైర్మన్‌గా సుధాకర్(టీడీపీ)
ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబు బృందం, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వ్యంగ్యంగా అభినందనలు తెలిపారు. ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం లేకుండా చేసి ఎన్నికల్లో ఎలా గెలవాలో నిరూపించారని విమర్శించారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకున్నారని, పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని, ఓటింగ్ శాతాన్ని సైతం తారుమారు చేశారని పేర్కొన్నారు. ప్రజలు అభ్యర్థులను ఎన్నుకోలేదని, అధికార పక్షమే అభ్యర్థులను ఎంపిక చేసుకుందని విమర్శించారు. ఇవి ఎన్నికలు కావని, కేవలం ఎంపికలని వ్యాఖ్యానిస్తూ ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా మురసు తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో చీరాల మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపును రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కౌంటింగ్ కేంద్రంలోకి వరద నీరు చేరడంతో పాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు నివేదించారు. సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్ల భద్రతకు ముప్పు ఉందని కలెక్టర్ నివేదికలో పేర్కొన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల పత్రాలు దెబ్బతినడంతో పాటు విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని వివరించారు. కలెక్టర్ విజ్ఞప్తికి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గా జనసేన అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
వార్డుల సంఖ్య…36
ఏకగ్రీవం…3
టీడీపీ…..5
జనసేన….16
బీజేపీ…..1
వైసీపీ….1
ఇండిపెండెంట్…10
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
గుంతకల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా యశోద(టీడీపీ)
గుత్తి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తమిళ్ సెల్వి(TDP)
తాడిపత్రి చైర్‌పర్సన్‌గా రేష్మ పర్వీన్(టీడీపీ)
రాయదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా హనుమంతు(టీడీపీ)
కల్యాణదుర్గం చైర్‌పర్సన్‌గా బుట్న లక్ష్మి(టీడీపీ)
కదిరి మున్సిపల్ చైర్మన్‌గా అర్షియా భాను(టీడీపీ)
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌గా మేకల ఈశ్వర్(జనసేన)
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా మంజునాథ్(టీడీపీ)
మడకశిర మున్సిపల్ చైర్‌పర్సన్‌గా శారద(జనసేన)
పెనుకొండ చైర్మన్‌గా త్రివేంద్రమూర్తి(టీడీపీ)
ధర్మవరం మున్సిపల్ చైర్మన్‌గా సుధాకర్(టీడీపీ)
మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సుష్మారెడ్డి(TDP)
చిలకలూరిపేట చైర్‌పర్సన్‌గా రాజేశ్వరి(జనసేన)
రేపల్లె మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అపర్ణ(టీడీపీ)
తెనాలి మున్సిపల్ చైర్మన్‌గా వెంకట రమణారావు(జనసేన)
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
నందికొట్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఫాతిమా(వైసీపీ)
గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సునీత(బీజేపీ)
ఎమ్మిగనూరు చైర్‌పర్సన్‌గా మాచాని సునీత(టీడీపీ)
ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న(జనసేన రెబల్)
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్‌గా గోవిందరాజులు(టీడీపీ)
ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్‌గా షేక్ అనీషా(టీడీపీ)
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ రికార్డు విజయం.. రెండున్నర దశాబ్దాల తర్వాత చైర్మన్ పీఠం కైవసం!
ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.
దాదాపు రెండున్నర దశాబ్దాల అనంతరం టీడీపీకి చైర్మన్ పీఠం దక్కింది.
టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ఆశి లీలారాణి తన సమీప వైసీపీ ప్రత్యర్థి పిలక రాజలక్ష్మిపై 5,834 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
28 వార్డుల్లో పార్టీల వారీగా ఫలితాలు:
– టీడీపీ – 16 (ఒక ఏకగ్రీవంతో సహా)
– వైసీపీ – 7
– జనసేన – 3
– స్వతంత్రులు – 2
కౌన్సిలర్ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు మెజారిటీ స్థానాలను దక్కించుకున్నారు.
రెండున్నర దశాబ్దాల తర్వాత ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీకి దక్కడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది.
– టీడీపీ – 33 మున్సిపాలిటీల్లో విజయం, మరో 25 చోట్ల ఆధిక్యం.
– జనసేన – 10 మున్సిపాలిటీల్లో విజయం, మరో 5 చోట్ల ఆధిక్యం.
– బీజేపీ – 3 మున్సిపాలిటీల్లో విజయం, మరోచోట ఆధిక్యం.
– వైసీపీకి పట్టున్న పులివెందులలోనూ టీడీపీ విజయం.
మొత్తంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 13 కార్పొరేషన్లలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
– విశాఖపట్నం: టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణికి 1,92,743 ఓట్ల ఆధిక్యం.
– ఏలూరు: జనసేన అభ్యర్థి అప్పలనాయుడుకు 9,126 ఓట్ల ఆధిక్యం.
– గుంటూరు: లక్ష్మీఅపర్ణకు 20,339 ఓట్ల ఆధిక్యం.
– మచిలీపట్నం: టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అబీదా ఘన విజయం.
– విజయవాడ: జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకు ఆధిక్యం.
– కడప: సువర్ణకు 18 వేల ఓట్ల ఆధిక్యం.
– కర్నూలు: టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూషకు 16 వేల ఓట్ల ఆధిక్యం.
– తిరుపతి: టీడీపీ అభ్యర్థి హేమలతకు 29 వేల ఓట్ల ఆధిక్యం.
– అనంతపురం: మొదటి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.
– ఒంగోలు: తుఫాన్ ప్రభావంతో కౌంటింగ్ మరింత ఆలస్యం.
కడప కార్పొరేషన్లో కూటమి అభ్యర్థి హవా
మేయర్ అభ్యర్థి సువర్ణకు 18 వేల ఓట్ల ఆధిక్యం
ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కూటమి హవా
44 వార్డుల్లో 40 వార్డులు గెలుపొందిన కూటమి
టీడీపీ-38, జనసేన-1, బీజేపీ-1, వైసీపీ-2, ఇతరులు-2
కృష్ణా జిల్లా – మచిలీపట్నం: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. టీడీపీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదా విజయం సాధించారు. మాకు సహకరించిన కూటమి నేతలకు, నగర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అబిదా అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, మచిలీపట్నం (బందరు) నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తమ గెలుపును ముందుగానే ఊహించామని, ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందని అబ్దుల్ అబిదా వ్యాఖ్యానించారు. బందరు అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్‌గా ఎన్నికైన అబ్దుల్ అబిదా హామీ ఇచ్చారు.
కడప జిల్లా – పులివెందుల: పులివెందుల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.
టీడీపీ చైర్మన్ అభ్యర్థి తూగుట్ల గీత తన సమీప వైసీపీ ప్రత్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై 13,875 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
పార్టీల వారీగా వార్డుల ఫలితాలు:
– టీడీపీ – 15
– జనసేన – 1
– బీజేపీ – 1
– వైసీపీ – 3
పోలింగ్ జరిగిన మొత్తం 20 వార్డుల్లో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకోగా, వైసీపీ మూడు వార్డులకే పరిమితమైంది.
పులివెందుల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
అందించిన ఎన్నికల ఫలితాల వివరాల ఆధారంగా రూపొందించిన వార్తా కథనం.
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
కౌంటింగ్‌లో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ముక్కా శ్రావణి 1,92,743 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. దీంతో జీవీఎంసీ మేయర్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
టీడీపీ మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూష భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ప్రత్యూష ప్రస్తుతం 16,578 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
మేయర్ పీఠం ఫలితంపై కర్నూలులో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 32 వార్డులకు గాను టీడీపీ 22 వార్డులను కైవసం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించింది.
పులివెందుల: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పులివెందులలో టీడీపీ అభ్యర్థులు పలువురు ఘన విజయం సాధించారు. పలు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులపై టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించగా, కొన్ని వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 20 వార్డుల ఫలితాల్లో టీడీపీ 16, వైసీపీ 3, జనసేన 1 వార్డులో విజయం సాధించారు.
6వ వార్డులో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి జాన్సీ మేరీ 446 ఓట్ల మెజాటితో గెలుపు..
8 వార్డులో వైసీపీ అభ్యర్థి పై టీడీపీ అభ్యర్థి షేక్ బాబా ఫకృద్దీన్ 343 ఓట్ల మెజారిటీతో గెలుపు..
9 వార్డులో వైసీపీ అభ్యర్థిపై జనసేన అభ్యర్థి ముని సుభాషిని 877 ఓట్ల మెజారిటీతో గెలుపు..
10 వార్డులో వైసీపీ అభ్యర్థిపై బీజేపి అభ్యర్థి విజయలక్ష్మి 636 ఓట్ల మెజారిటితో గెలుపు..
11 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి షేక్ ఫయాజ్ 390 ఓట్ల మెజారిటితో గెలుపు..
12 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అక్రమ్ బాషా 431 ఓట్ల మెజారిటీతో గెలుపు..
13 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 178 ఓట్ల మెజారిటీతో గెలుపు..
15 వార్డులో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి 357 ఓట్ల మెజారిటీతో గెలుపు..
18 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 391 ఓట్ల మెజారిటితో గెలుపు..
20 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి మునివర్దన్ 377 ఓట్ల మెజారిటితో గెలుపు..
21 వార్డులో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి వైయస్ మనోహర్ రెడ్డి 346 ఓట్ల మెజారిటీతో గెలుపు
23 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి కమలమ్మ 593 ఓట్ల మెజారిటితో గెలుపు
24 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి షేక్ మాబూజాన్ 907 ఓట్ల మెజారిటీతో గెలుపు
25 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అన్నారెడ్డి శివపార్వతి 175 ఓట్ల మెజారిటితో గెలుపు..
26 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లక్ష్మిదేవి 275 ఓట్ల మెజారిటీతో గెలుపు
27 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి హైమావతి 524 ఓట్ల మెజారిటితో గెలుపు
28 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి కిషోర్ 213 ఓట్ల మెజారిటీతొ గెలుపు..
31 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు 620 ఓట్ల మెజారిటీతో గెలుపు
33 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి తూగుట్ల మధుసూదన్ రెడ్డి 593 ఓట్ల మెజారిటితో గెలుపు
39 వార్డులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి డేరంగుల అనిత 731 ఓట్ల మెజారిటీతో గెలుపు
పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ 36 వార్డులలో గెలిచిన అభ్యర్థులు
టీడీపీ – 22
వైసీపీ – 7
బీజేపీ – 3
జనసేన – 3
సిపిఐ – 1
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీ సాధించారని తెలిపారు. వైసీపీ గెలిచినప్పుడు ప్రజాస్వామ్య విజయం అని చెప్పారని, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలపై నిందలు వేస్తున్నారని పెమ్మసాని విమర్శించారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించినప్పటికీ కూటమి అభ్యర్థులే విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు.
చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్ పూర్తయింది.
రెండో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ మేయర్ అభ్యర్థి కటారి హేమలత 12,708 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రౌండ్ రౌండ్‌కూ పెరుగుతున్న ఆధిక్యంతో చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖాతా తెరిచింది. 19వ వార్డులో వైసీపీ అభ్యర్థి కూసి సత్తిబాబు విజయం సాధించారు.
తన సమీప జనసేన ప్రత్యర్థి సికోటి కామేశ్వరిపై 176 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయాన్ని నమోదు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో 30వ వార్డు ఎన్నికల ఫలితాల్లో జనసేన, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో 30వ వార్డులో టై ఏర్పడింది. సమాన ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహిస్తున్నారు. రీకౌంటింగ్ ఫలితంపై ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి వెనుకంజలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం ముక్కా శ్రావణికి 2,56,881 ఓట్లు రాగా, వరుదు కళ్యాణికి 1,37,194 ఓట్లు వచ్చాయి. దీంతో ముక్కా శ్రావణి 1,19,687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
పోస్టల్ బ్యాలెట్లో కూటమి అభ్యర్థి వంవీటి రాధాకృష్ణ ఆధిక్యం
జనసేనకు 141 ఓట్లు
వైసీపీకి 63 ఓట్లు
600 ఓట్లతో వెనుకబడ్డ టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాత
కౌంటింగ్‌పై అనుమానాలు ఉన్నాయంటూ ఆందోళన
కౌంటింగ్ కేంద్రానికి భారీగా వైసీపీ, TDP శ్రేణులు
ఆదోని పురపాలక చైర్పర్సన్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో జనసేన రెబల్ అభ్యర్థి మల్లప్ప భార్య స్వప్న (ఉంగరం గుర్తు) సుమారు 3,500 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆదోని మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కర్నూలు జిల్లా ఆదోని పురపాలక ఎన్నికల్లో పార్టీల వారీగా అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 52 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు గెలుపొందారు.
పార్టీల వారీగా గెలుపొందిన వార్డులు:
– వైసీపీ – 19
– టీడీపీ – 20
– బీజేపీ – 3
– ఇండిపెండెంట్ – 1
– సీపీఐ – 1
– సీపీఎం – 1
నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పద్మావతి
యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రమ విజయం
30 వేలపై చిలుకు ఆధిక్యంలో టీడీపీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదా..
1వ డివిజన్లో జనసేన ముందంజ..
23 డివిజన్లలో టీడీపీ ముందంజ..
నందికొట్కూరు చైర్మన్ స్థానం వైసీపీ కైవసం
2,800 ఓట్లకుపైగా మెజార్టీతో ఫాతిమాభి విజయం
అనంతపురం: కల్యాణదుర్గం మున్సిపాలిటీ ఫలితాలు
మొత్తం 32 వార్డులకు గానూ టీడీపీ 26 విజయం
బీజేపీ-1, జనసేన-1, వైసీపీ-4 గెలుపు
అనంతపురం: తాడిపత్రిలో కూటమి క్లీన్‌స్వీప్
మొత్తం 48 వార్డులకు 30 ఏకగ్రీవం
టీడీపీ-15, జనసేన-01, బీజేపీ-2 గెలుపు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ ఫలితాలు:
మొత్తం 32 వార్డులకు టీడీపీ 12 ఏకగ్రీవం
టీడీపీ 26, వైసీపీ 4 వార్డుల్లో కైవసం
నందికొట్కూరులో కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ రాజకుమారి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
మరోవైపు, రీకౌంటింగ్ నిర్వహించాలని టీడీపీ వర్గీయులు పట్టుబడుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిద్ధార్థరెడ్డి ధర్నాకు దిగారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల డిమాండ్లతో ఉత్కంఠ నెలకొంది.
నంద్యాల జిల్లా బేతంచెర్లలో కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ అభ్యర్థులు విజయం సాధించిన కొన్ని వార్డుల్లో అధికారులు రీకౌంటింగ్ చేపట్టడంతో వివాదం మొదలైంది. రీకౌంటింగ్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. అనంతరం కేంద్రం వెలుపల వైసీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలతో చర్యలు చేపట్టారు. దీంతో బేతంచెర్లలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇచ్చాపురం, పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలు, పాలకొండ నగర పంచాయతీలలో విజయకేతనం ఎగరవేసిన కూటమి అభ్యర్థులు.
పలాస మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ అభ్యర్థిని వజ్జ గంగాభవాని గెలుపు. ఇచ్చాపురంలో టిడిపి అభ్యర్థిని ఆశి లీలారాణి విజయం.
పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ రేసులో ముందంజలో జనసేన అభ్యర్థిని పళ్ళ విజయనిర్మల
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ రెండో వార్డులో కౌంటింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత వైసీపీ అభ్యర్థి సగుటూరు మాధవి విజయం సాధించగా, టీడీపీ అభ్యర్థి పసల వాణి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతరం టీడీపీ అభ్యర్థి 6 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్దకు వస్తున్న సూళ్లూరుపేట మాజీ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంజీవయ్యను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు. ఈ ఘటనతో నాయుడుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నంద్యాల జిల్లా బేతంచర్లలో ఉద్రిక్తత
వైసీపీ గెలిచిన వార్డుల్లో రీకౌంటింగ్‌కు టీడీపీ పట్టు
టీడీపీ గెలిచిన వార్డుల్లో రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు
వైసీపీ గెలిచిన వార్డుల్లో రీకౌంటింగ్
రీకౌంటింగ్‌ను నిరసిస్తూ వైసీపీ శ్రేణుల ధర్నా
భారీగా మోహరించిన టీడీపీ, వైసీపీ శ్రేణులు
ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు
ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ
చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల ఫలితాలు
మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 26 స్థానాల్లో విజయం
వైసీపీ 7, జనసేన 2 స్థానాల్లో గెలుపు
ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ తుఫాన్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగిందని పేర్కొన్నారు. తాము చేసిన పనులకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలన అందించడం, ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తమ పరిపాలనకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే మద్దతు ప్రభుత్వానికి అదనపు శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల కంటే ప్రజల ఇబ్బందుల పరిష్కారానికే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. మనం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించగలిగితే వారు తప్పకుండా ఆమోదిస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న కూటమి జోరు.
జగ్గయ్యపేట,ఉయ్యూరు, పెడన మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కూటమి.
పెడన మున్సిపాలిటీ కూటమి నుంచి జనసేన తరపున చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన అభ్యర్థి బళ్ల జ్యోత్స్న రాణి గెలుపు.
జగ్గయ్యపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూటమి నుంచి టీడీపీ తరపున అభ్యర్థి నరేంద్రుల వినీత విజయం.
ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కూటమి తరఫున టీడీపీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా చెదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ విజయం.
కొండపల్లి, తిరువూరు, నందిగామలో గెలుపు దిశగా కొనసాగుతున్న కూటమి అభ్యర్థులు.
నెల్లూరులో అన్ని డివిజన్లలో టీడీపీ హవా కొనసాగుతుండటంతో గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యాలయం మొత్తం విజయోత్సాహంతో హోరెత్తింది.
తిరుపతి జిల్లా నాయుడుపేటలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కిలివేటి సంజీవయ్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తుఫాన్ ప్రభావంతో కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఉద్యోగుల సమిష్టి కృషితో నిర్ణీత సమయంలోనే పూర్తి చేయగలిగామని కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 90 శాతం కౌంటింగ్ పూర్తయిందని వెల్లడించారు. సాధారణ రోజుల్లో కౌంటింగ్ నిర్వహించడం వేరు, తుఫాన్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో నిర్వహించడం వేరని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకపోయినా ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ విధులు ముగిసిన వెంటనే ఉద్యోగులు తదుపరి ఎన్నికల ఏర్పాట్లలో పాల్గొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే నిరంతరం బాధ్యతలు, ఉరుకులు పరుగులని కలెక్టర్ వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కౌంటింగ్ కేంద్రంలో గందరగోళం
41వ వార్డులో వైసీపీ అభ్యర్థి అనిల్ విజయం
డిక్లరేషన్ ఫామ్‌ను టీడీపీ నేతలు చించేశారని ఆరోపణ
ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కూటమి అభ్యర్థి వినీత విజయం
మొత్తం 36 వార్డులకు కూటమి 12 ఏకగ్రీవం
24 వార్డుల కౌంటింగ్‌లో టీడీపీ – 14, జనసేన – 5, వైసీపీ – 3
బీజేపీ – 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానం కైవసం
విజయవాడలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
తుఫాన్ ఎఫెక్ట్‌తో ఆలస్యంగా ప్రారంభమైన కౌంటింగ్
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మున్సిపాలిటీల ఫలితాలు
ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బొమ్మిరెడ్డి
వెంకటగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దొంతు శారద
సూళ్లూరపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సుహాసిని విజయం
పలమనేరు మున్సిపాలిటీలో ఉద్రిక్తత
35 వార్డుల్లో రీకౌంటింగ్‌కు టీడీపీ డిమాండ్
మొత్తం 36 వార్డులకు టీడీపీ 26 వార్డులు కైవసం
వైసీపీ 7, జనసేన రెండు వార్డుల్లో విజయం
శ్రీకాకుళం జిల్లా పలాస – కాశీబుగ్గ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పద్మపై టీడీపీ అభ్యర్థి వజ్జ గంగా భవాని విజయం సాధించారు. విజయోత్సాహంతో కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చిన వజ్జ గంగా భవాని, బాబూరావు దంపతులు
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ ఫలితాలు
మొత్తం 36 వార్డులకు 32 చోట్ల టీడీపీ విజయం
జనసేన 3, బీజేపీ ఒక చోట గెలుపు
ఖాతా తెరవని వైసీపీ.
కృష్ణా జిల్లా మచిలీపట్నం 50వ డివిజన్లో రీకౌంటింగ్
13 ఓట్లతో విజయం సాధించిన వైసీపీ
కూటమి అభ్యంతరంతో రీకౌంటింగ్
ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
టీడీపీ: 6
జనసేన: 6
బీజేపీ: 1
ఇండిపెండెంట్: 1
ఇప్పటి వరకు ఖాతా తెరవని వైసీపీ అభ్యర్థులు .
నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్‌గా జనసేన అభ్యర్థి మురాల జ్యోతి 6,372 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కర్నూలు కార్పొరేషన్:
కర్నూలు నగర మేయర్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రత్యూష ఆధిక్యత
వైసీపీ అభ్యర్థిపై 7,000 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ప్రత్యూష
ఆధిక్యంలో నంద్యాల మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బాబన్
2,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న బాబన్
పూర్తి ఆధిక్యంలో ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి మాచాని సునీత
ఆధిక్యంలో గూడూరు నగర పంచాయతీ చైర్మన్ బీజేపీ అభ్యర్థి సునీత బాయి
ఆదోని మున్సిపాలిటీలో ఆధిక్యంలో కొనసాగుతున్న జనసేన రెబల్ అభ్యర్థి స్వప్న
పూర్తి ఆధిక్యంలో నందికొట్కూరు మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఫాతిమాభి
బేతంచెర్ల నగర పంచాయతీలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి దస్తగిరి ఆధిక్యత
బేతంచెల్ల మునిసిపాలిటీలోని 28 వార్డులలో 18 వైసీపీ, ఎనిమిది వార్డుల్లో టీడీపీ విజయం. మిగిలిన రెండు వార్డులలో ఐదు ఓట్ల తేడాతో టీడీపీకి ఆధిక్యం. రీపోలింగ్ జరిపించాలని వైసీపీ డిమాండ్. పూర్తిగా ఆగిపోయిన కౌంటింగ్.
ఆత్మకూరు, ఆళ్లగడ్డలలో ఏకగ్రీవం చైర్మన్ పదవులు టీడీపీ కైవసం
డోన్ లో వెనుకబడిన టీడీపీ చైర్మన్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత
సమీప వైసీపీ అభ్యర్థి వాల్మీకి చైతన్య 150 ఓట్ల ఆధిక్యం
డోన్ లో కొనసాగుతున్న కౌంటింగ్
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ మేయర్ అభ్యర్థుల ముందంజ
టీడీపీ అభ్యర్థులు జేబీ శ్రీనివాస్, కటారి అనురాధ ఆధిక్యం
పుంగనూరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల్లో టీడీపీ చైర్మన్ అభ్యర్థులు గెలుపు
పుంగనూరులో నయీమ్ తాజ్, నగరిలో శ్రీనివాసన్ మున్సిపల్ చైర్మన్లుగా టిడిపి అభ్యర్థులు ఏకగ్రీవం
కుప్పం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రాజ్ కుమార్ విజయం
కుప్పంలో ఖాతా తెరవని వైసీపీ
నగరిలో 7 వార్డుల్లో, పలమనేరులో 6 వార్డుల్లో, పుత్తూరులో 3 వార్డుల్లో, మదనపల్లిలో 5 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపు.
శ్రీకాకుళం జిల్లా పలాస మునిసిపల్ ఫలితాల్లో 35వ వార్డులో టై
టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు
రీకౌంటింగ్‌లోనూ సమానంగా వచ్చిన ఓట్లు
లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థిని మార్పు అరుణ విజయం
మదనపల్లి:
మదనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు ముందంజ
మదనపల్లిలో మొత్తం వార్డులు – 48
టీడీపీ – 11
బీజేపీ – 2
జనసేన – 3
వైసీపీ – 5
స్వతంత్రులు – 2
నగిరి:
నగిరి మున్సిపాలిటీలో మొత్తం వార్డులు – 40
టీడీపీ – 32
వైసీపీ – 7
జనసేన – 1
పుత్తూరు:
పుత్తూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు – 36
టీడీపీ – 22
వైసీపీ – 3
జనసేన – 2
జనసేన అభ్యర్థి ఏలుమలై ముందంజలో ఉన్నారు.
పుంగునూరు:
పుంగునూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డులు – 36
టీడీపీ – 30
జనసేన – 2
బీజేపీ – 2
సిపిఐ – 1
ఇతరులు – 1
పలమనేరు:
పలమనేరు మునిసిపాలిటీలో మొత్తం వార్డులు – 36
టీడీపీ – 13
వైసీపీ – 3
జనసేన -1
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీ.
మొత్తం వార్డులు – 52
ఫలితాలు ప్రకటించిన వార్డులు – 52
టీడీపీ – 29
జనసేన – 16
బీజేపీ – 1
వైసీపీ – 6
విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ ఫలితాల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి అధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు లెక్కించిన ఓట్లు: 47,635
టీడీపీ – 28,115
వైసీపీ – 13,749
కాంగ్రెస్ – 596
ఇతరులు – 5,175
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 14,366 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
నంధ్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
2వ రౌండ్లో వైసీపీ అభ్యర్థి ఫాతిమాకి 1,300 ఆధిక్యం
అధికారుల తీరుపై TDP ఆందోళన, నిలిచిపోయిన కౌంటింగ్
నందికొట్కూరులో భారీగా పోలీసుల మోహరింపు
బేతంచెర్ల నగర పంచాయతీలో నిలిచిపోయిన కౌంటింగ్
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం
చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపు
వైసీపీ అభ్యర్థిపై 11 వేల ఓట్ల మెజార్టీతో విజయం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కౌంటింగ్ పూర్తి
32 వార్డుల్లో టీడీపీ-20, జనసేన-6, బీజేపీ-1
వైసీపీ-3, ఇతరులు-2 స్థానాల్లో విజయం
కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ కూటమి కైవసం
4,811 ఓట్ల మెజారిటీతో TDP అభ్యర్థి ప్రవీణ్ విజయం
32 వార్డులకు టీడీపీ 21, జనసేన 7 స్థానాల్లో గెలుపు
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మున్సిపల్ చైర్మన్ టీడీపీ కైవసం
17,977 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అజయ్‌కుమార్ గెలుపు
36 వార్డుల్లో ఒక్కటి కూడా గెలవని వైసీపీ
టీడీపీ 24, జనసేన 10, బీజేపీ 2 చోట్ల గెలుపు
ఏపీలో 87 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు
కూటమి-63
టీడీపీ-45
జనసేన-15
బీజేపీ-3 మున్సిపాలిటీలు కైవసం
వైసీపీ-5
ఇతరులు-3 మున్సిపాలిటీలు కైవసం
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబిదా 30 వేల ఓట్ల ఆధిక్యం..
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో బోణీ కొట్టిన కూటమి అభ్యర్థులు
33వ వార్డులో జనసేన విజయం
39వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపు
కర్నూలు 31వ వార్డు టిడిపి అభ్యర్థి ప్రవీణ్ కుమార్ 893 ఓట్లతో గెలుపు
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు:
నరసాపురం మున్సిపాలిటిలో మొత్తం వార్డులు :36
టీడీపీ:15
జనసేన:15
బీజేపీ: 01
వైసీపీ: 04
ఇండిపెండెంట్: 01
ఏపీలో 13 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు
టీడీపీ – 9
జనసేన – 1
మరో 3 కార్పొరేషన్లలో కొనసాగుతున్న కౌటింగ్