AP MPTC ZPTC Election Results: ఏకపక్షంగా పరిషత్ పోరు.. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ జోరు

| Edited By: Anil kumar poka

Sep 19, 2021 | 11:39 AM

AP MPTC ZPTC Election Results: పరిషత్ పోరు దాదాపు ఏకపక్షంగా మారిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది.

AP MPTC ZPTC Election Results: ఏకపక్షంగా పరిషత్ పోరు.. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ జోరు
Andhra Pradesh Mptc Zptc Polls
Follow us on

AP MPTC ZPTC Election Results: పరిషత్ పోరు దాదాపు ఏకపక్షంగా మారిపోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచే పలుచోట్ల వైసీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో జిల్లాల వారీగా పరిషత్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

>>విశాఖ పట్నం జిల్లాలో వైసీపీ 37 ఎంపీటీసీలు (మొత్తం 651), 1 జెడ్పీటీసీ(మొత్తం 39) గెలుచుకోగా.. ఇతరులు ఒక ఎంపీటీసీ గెలుచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ 75 ఎంపీటీసీలు (మొత్తం 1086) గెలుచుకోగా.. టీడీపీ 1, బీజేపీ 2, ఇతరులు 1 గెలుచుకున్నాయి.

>>పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ 2 జెడ్పీటీసీలు(మొత్తం 48), 67 ఎంపీటీసీలు( మొత్తం 863) గెలుచుకుంది. టీడీపీ 3, బీజేపీ 1, ఇతరులు 4 ఎంపీటీసీలు గెలుచుకున్నారు.

>>కృష్ణా జిల్లాలో వైసీపీ 2 జెడ్పీటీసీలు(మొత్తం 46), 67 ఎంపీటీసీలు(మొత్తం 723) గెలుచుకుంది. టీడీపీ 2 ఎంపీటీసీలు గెలుచుకుంది.

>>గుంటూరు జిల్లాలో వైసీపీ 8 జడ్పీటీసీలు(మొత్తం 54), 202 ఎంపీటీసీలు(మొత్తం 805) గెలుచుకుంది. టీడీపీ 4, బీజేపీ 1, ఇతరులు 6 ఎంపీటీసీలు గెలుచుకున్నారు.

>>ప్రకాశం జిల్లాలో వైసీపీ 15 జడ్పీటీసీలు(మొత్తం 55), 317 ఎంపీటీసీలు(మొత్తం 742) గెలుచుకుంది. టీడీపీ 25, ఇతరులు 5 ఎంపీటీసీల్లో గెలిపొందారు.

>>నెల్లూరు జిల్లాలో వైసీపీ 13 జడ్పీటీసీలు( మొత్తం 46), 188 ఎంపీటీసీలు (మొత్తం 554) గెలుచుకుంది. టీడీపీ 4, ఇతరులు 4 ఎంపీటీసీలు గెలిచారు.

>>చిత్తూరు జిల్లాలో వైసీపీ 29 జడ్పీటీసీలు(మొత్తం 65), 426 ఎంపీటీసీలు(మొత్తం 841) గెలుచుకుంది. టీడీపీ 14, ఇతరులు 4 ఎంపీటీసీల్లో గెలిచారు.

>>కడప జిల్లాలో వైసీపీ 38 జెడ్పీటీసీ(మొత్తం 50), 426 ఎంపీటీసీలు(మొత్తం 858) గెలుచుకుంది. టీడీపీ 7, బీజేపీ 2, ఇతరులు 3 చోట్ల గెలిచారు.

>>కర్నూలు జిల్లాలో వైసీపీ 16 జడ్పీటీసీ(మొత్తం 53), 277 ఎంపీటీసీలు (మొత్తం 550) గెలిచారు. టీడీపీ 42, బీజేపీ 2, ఇతరులు 1 ఎంపీటీసీలో గెలిచారు.

>>అనంతపురం జిల్లాలో వైసీపీ 46 ఎంపీటీసీలు(మొత్తం 804) గెలుచుకోగా.. టీడీపీ 1 ఎంపీటీసీ గెలుచుకుంది.

>>శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 64 ఎంపీటీసీలు(మొత్తం 667), ఇతరులు 2 ఎంపీటీసీలు గెలుచుకున్నారు.

>>విజయనగరంలో వైసీపీ 3 జడ్పీటీసీలు(మొత్తం 34), 51 ఎంపీటీసీలు గెలుచుకుంది. ఇతరులు 2 ఎంపీటీసీల్లో గెలిచారు.

Also Read: AP MPTC ZPTC Elections Counting: పరిషత్‌ ఎన్నిల కౌంటింగ్‌లో పదనిసలు.. ఆసక్తికర విషయాలు

Balapur Ganesh Laddu: బాలాపూర్‌ లడ్డూ మళ్లీ సరికొత్త రికార్డ్‌.. ఎంత పలికిందో తెలుసా..