చంద్రబాబుకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్

|

Sep 15, 2020 | 3:09 PM

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా..? అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజధానిలో అక్రమాలు జరగకుంటే బాబు..

చంద్రబాబుకి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్
Follow us on

అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ స్వీకరించే దమ్ముందా..? అంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజధానిలో అక్రమాలు జరగకుంటే బాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సీబీఐకి లేఖ రాయగలరా అన్నారు. దమ్ముంటే అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలన్నారు. అటు, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో కూడా భారీ అవినీతి జరిగిందని మంత్రి అన్నారు. వీటన్నిటిపై కేబినెట్ సబ్ కమిటీ, దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా.. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతామన్నారు. రాజధాని భూ కుంభకోణంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయని.. రైతుల కోసమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని.. రైతులను చంద్రబాబు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.