అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్. ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువు, చిన్న కండలేరు చెరువుకు పడిన గండి పూడ్చకపోతే… తానే రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. చెరువుకు పడిన గండిని పరిశీలించిన మంత్రి… రెండు రోజులైనా దాన్ని పూర్తిస్తాయిలో పూడ్చకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు మధ్యాహ్నానికి చెరువు గండి పూడ్చకుంటే… తానే చెరువులో దిగి మరమ్మత్తులు చేపడతానంటూ అధికారులపై ఫైరయ్యారు. యుద్ద ప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.