AP Local Body Elections : ఎవరూ మమ్మల్ని నిందించొద్దు.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని కలుసుకున్నారు ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. ఎన్నికల విధుల్లో గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి...

AP Local Body Elections : ఎవరూ మమ్మల్ని నిందించొద్దు.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
SEC Nimmagadda Ramesh Kumar

Updated on: Feb 06, 2021 | 5:56 PM

AP Local Body Elections : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని కలుసుకున్నారు ఏపీ ఉద్యోగసంఘాల నేతలు. ఎన్నికల విధుల్లో గర్భిణులు, బాలింతలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్నికల విధుల్లో రేయింబవళ్లు కష్టపడుతున్న ఉద్యోగులు, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఎవరూ వ్యాఖ్యానించొద్దని.. ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.

ఎన్నికల విధుల్లో ఉద్యోగుల మీద తీవ్ర పని ఒత్తిడి ఉందన్నారు ఉద్యోగసంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. షెడ్యూల్‌లో మార్పులు, కొందరికి ఎన్నికల విధులనుంచి మినహాయింపుపై ఎస్‌ఈసీని అభ్యర్థించామన్నారు బొప్పరాజు.

ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమే ప్రస్తుత తమముందున్న కర్తవ్యమన్నారు ఉద్యోగసంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగులు తప్పుచేస్తే ఎప్పుడైనా శిక్షించే నిబంధనలు ఉన్నాయన్నారు. అధికారులు, ఉద్యోగులను మీ వ్యాఖ్యలతో రెండు పక్షాలు ఇబ్బంది పెట్టవద్దని కోరారు బొప్పరాజు.

ఇవి కూడా చదవండి :

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మోడల్ పేపర్లలో కీలక మార్పులు.. విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డ్..!
AP Corona Bulletin : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..!