AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఎప్పుడంటే..

AP Local Body Elections Schedule Released: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల తేదీలను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకటించగానే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అన్నిచోట్లా 50శాతం మహిళలకు సీట్లు కేటాయించారు.

AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీ ఎప్పుడంటే..
Ap Local Body Election 2026

Edited By:

Updated on: Oct 14, 2026 | 4:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు బెల్ మోగించి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ చేపట్టింది. తొలుత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్‌ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. మొత్తం 13 మున్సిపల్‌ కార్పోరేషన్లు, 77 మున్సిపాల్టీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

అక్టోబర్‌ 18న నామినేషన్లు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌లోనే ప్రారంభం కానుంది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం.. మున్సిపాలిటీ ఎన్నికలకు అక్టోబర్ 14 నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్‌ 18న నామినేషన్ల స్వీకరణ, 19, 20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అక్టోబర్‌ 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అక్టోబర్‌ 28న పోలింగ్‌ నిర్వహించి, అక్టోబర్‌ 30న ఫలితాలు వెల్లడించనున్నారు.

నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

మున్సిపల్‌ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై దృష్టి సారించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 3న పోలింగ్‌, నవంబర్‌ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనకు కీలకమైన ఈ ఎన్నికలతో రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత వేడెక్కనుంది. దీనికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అక్టోబర్ 23 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు. ఉపసంహరణకు అక్టోబర్ 27వరకు గడువు ఉంది.

మూడు విడతల్లో పంచాయతీ..

మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ రోజే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడవ్వనున్నాయి.

నవంబర్ 26 – తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు

నవంబర్ 29 – రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు

డిసెంబర్ 2 – మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు

 

లైవ్ వీడియో చూడండి..

 

జడ్పీ రిజర్వేషన్ల వివరాలు..

అనంతపురం, కర్నూలు, విశాఖ ZP స్థానాలు బీసీకి, NTR, ప్రకాశం-ఎస్సీ రిజర్వ్ చేశారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి బీసీ మహిళగా.. కడప, పశ్చిమగోదావరి సత్యసాయి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, అన్నమయ్య జనరల్‌ స్థానాలుగా నిర్ణయించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, కృష్ణా, బాపట్ల, కాకినాడ, చిత్తూరు జిల్లా జెడ్పీ స్థానాలు జనరల్‌ మహిళకు.. కోనసీమ, తిరుపతి, గుంటూరు ఎస్సీ మహిళగా నిర్ణయించారు. పార్వతీపురం, అల్లూరి జిల్లా జెడ్పీ స్థానాలు ఎస్టీకి, పోలవరం-ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు.

17కార్పొరేషన్లలో..

17కార్పొరేషన్లలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు ఐదు మేయర్‌ స్థానాలు కేటాయించారు.. జనరల్‌ మహిళలకు ఐదు స్థానాలు రిజర్వ్‌ చేసింది. నాలుగు స్థానాలను అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీగా ప్రకటించింది.

106 మున్సిపాలిటీల్లో..

106 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు మూడు స్థానాలు కేటాయించారు. అందులో ఒకటి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఎస్సీలకు మొత్తం 14 కేటాయించగా వాటిలో మహిళలకు ఏడు, జనరల్‌కు ఏడు కేటాయించారు. బీసీలకు 36 స్థానాలు దక్కాయి. వీటిలో మహిళలకు 18, జనరల్‌కు 18 ఉన్నాయి. జనరల్‌ మహిళలకు 27 స్థానాలు రిజర్వ్ చేయగా.. జనరల్ కేటగిరీలో మరో 26 చైర్‌పర్సన్ స్థానాలు ఉన్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో స్థానిక సంస్థల ఎన్నికలు, సన్నద్ధతపై చర్చించిన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ.. పులు సూచనలు చేశారు. కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటీ సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని పార్టీలు విజ్ఞప్తి చేయగా.. అధికారులకు ఆదేశిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే మద్యాన్ని కంట్రోల్ చేయడంతో పాటు, ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అభ్యర్థులకు పోలీసు రక్షణ కల్పించాలని SECని కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us