AP Inter Results 2026: వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ ఒక్క మెస్సేజ్ పెడితే సెకన్లలోనే మీ ముందుకు..

ఏపీ ఇంటర్ ఫలితాడు ఇవాళ విడుదల అవుతున్నాయి. మంత్రి నారా లోకేష్ తన చేతుల మీదగా రిలీజ్ చేయనున్నారు. అయితే విద్యార్థులు వాట్సప్‌ ద్వారానే తమ ఫలితాలను సులువుగా పొందవచ్చు. జస్ట్ హాయ్ అని ఒక మెస్సేజ్ పెట్టడం ద్వారా సులువుగా వాట్సప్‌లోనే రిజల్ట్స్ పొందవచ్చు.

AP Inter Results 2026: వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ ఒక్క మెస్సేజ్ పెడితే సెకన్లలోనే మీ ముందుకు..
Inter Results

Updated on: Apr 15, 2026 | 9:58 AM

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదల అవ్వగా.. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల బుధవారం విడుదల అవుతున్నాయి. ఉదయం 10.31 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా.. ప్రథమ సంవత్సరం పరీక్షలు 5,31,275 మంది, ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ 5,26,264 మంది రాశారు. దీంతో 10 లక్షలమందికిపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

జస్ట్ వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెడితే..

ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఆరో సబ్జెక్టు మార్కులు విడిగా వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఉమ్మడి కృష్ణా జిల్లా (ప్రస్తుత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు కలిపి) నుండి దాదాపు 1,02,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అయితే ఫలితాలను ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://results-bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్ ద్వారా కూడా విద్యార్థులు సులువుగా ఫలితాలను చూసుకోవచ్చు. జస్ట్ వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టడం ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్‌ను సెకన్లలోనే పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరి 23 నుంచి మొదలైన ఇంటర్ పరీక్షలు మార్చి 23 వరకు జరిగాయి. అనంతరం మూల్యాంకనం పూర్తవ్వగా.. ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

వాట్సప్ ద్వారా ఎలా అంటే..?

​-వాట్సప్ ద్వారా కూడా ఫలితాల కోసం 9552300009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ చెయ్యాలి

-మోనూ డిస్‌ప్లే అవుతుంది

-మోనూలో సెలక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి

-అనంతరం విద్యా సేవలు అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత ఏపీ ఇంటర్ ఫలితాలు 2026 ఎంచుకోవాలి

-హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి

-మీ ఫలితాలు మీకు వాట్సప్‌లోనే వచ్చేస్తాయి

వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవడం ఎలా..?

-https://resultsbie.ap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండియర్ అనేది సెలక్ట్ చేసుకోండి

-హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి

-మీ రిజల్ట్స్ వస్తాయి. డౌన్ లోడ్ తీసుకుంటే సరిపోతుంది

Follow Us