ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఆ పార్టీకి మొండిచెయ్యే ఎదురైంది. చివరికి ఎన్నికల సంఘానికి సహకరిస్తామనే స్థాయికి వచ్చింది ప్రభుత్వం. అయితే ఎన్నికలను అడ్డుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
ఓటరు లిస్టు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. పంచాయతీ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది.
గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2019 ఎలక్ట్రోరల్ రూల్స్ ద్వారా ఎన్నికలు జరిపిస్తే 3.60 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కింది. అయితే వాదోపవాదాల అనంతరం పిటిషన్ వాదనలు ఏకీభవించని ధర్మాసనం.. ఎన్నికల ప్రాసెస్ లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది.
Read More:
గజ్వేల్ సిగలో మరో కలికితురాయి.. సంగాపూర్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు