AP Highcourt On Volunteers :ప్రజలకు పాలన మరింత దగ్గర చేయడానికి, గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లను నియమించింది జగన్ ప్రభుత్వం. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా, ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా, వాలంటీర్ల ద్వారా అనేక సేవలను అందిస్తోంది. అయితే, కొన్నిచోట్ల వాలంటీర్లు చేసే పనులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్హులకు వైఎస్‌ఆర్ చేయూత(YSR Cheyutha) పథకం నిలిపివేతపై, గుంటూరు జిల్లా(Guntur District) పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన 26 మంది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ ఇష్యూలో ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను నిర్ణయించడంలో వారికేం సంబంధం ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై వివరణ కోరింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలపై ప్రశ్నించింది హైకోర్టు. వాలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? అసలు వారు ప్రభుత్వ ఉద్యోగులేనా? లబ్ధిదారుల ఎంపికలో వారి జోక్యం ఏమిటీ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కోర్టు, అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వాలంటీర్స్ వ్యవస్థ ఏపీలో అతిముఖ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను, అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వాలంటీర్ల పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సర్వీసులు పొందడానికి వీలవుతుంది. అంతేకాదు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందొచ్చు. తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను నిజం చేస్తామని, ఈ వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పారు ముఖ్యమంత్రి జగన్.
Also Read: Telangana: కట్టుకున్నవాడిని కాదని, ప్రియుడితో వెళ్లింది. కానీ, కొన్ని రోజుల్లోనే సీన్ రివర్స్