ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలకు పెంపు!

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి ఇచ్చే ఆర్థిక సాయం రూ.20వేలకు పెంపు!
Ap Municipal Outsourcing Employees

Updated on: Jul 19, 2026 | 10:18 AM

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పనిచేస్తూ మరణించే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుటుంబాల అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో సిబ్బంది మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.15 వేలు అందించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.20 వేలకు పెంచారు.

పెంచిన ఈ మొత్తాన్ని ఆయా అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే భరించాలని ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

పట్టణాలు, నగరాల పరిశుభ్రతలో ఔట్ సోర్సింగ్ కార్మికులు ఎంతో కీలకం. కాబట్టి వారికి ఆర్థకంగా అండగా ఉండేందుకు, ఒకవేళ ఎవరైనా కార్మికులు మరణిస్తే.. వారి అంతిమ సంస్కారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేలా ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us